BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో Phd ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే
Dr. BR Ambedkar Open University Admissions : పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(BRAOU). 2023 -2024 విద్యాసంవత్సరానికి సంబందించి ప్రవేశాలను కల్పిస్తారు. ఈ మేరకు కోర్సుల వివరాలు, ఫీజులు, అర్హతలను పేర్కొంది.
BRAOU Phd admissions Updates: పీహెచ్డీ(Phd admissions) చేయాలనుకునే వారికి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ(BRAOU). 2023-24 విద్యా సంవత్సరానికి ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా…..మే 3వ తేదీ వరకు గడువు ఉంది. రూ.500 ఆలస్య రుసుంతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ప్రవేశాలను ఇంగ్లీష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తో పాటు మరికొన్ని కోర్సుల్లో నిర్వహిస్తారు. మే 25వ తేదీన ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఉటుందని అధికారులు తెలిపారు. https://ts-braouphdcet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. వివరాలు కోసం 040-23544741/040-23680411/040-23680498 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ముఖ్య వివరాలు:
- ప్రవేశాలు - పీహెచ్డీ
- వర్శిటీ - అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, హైదరాబాద్
- అందుబాటులో ఉన్న కోర్సులు - ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్.
- అర్హత పరీక్ష - మే 25వ తేదీన పరీక్ష
- అర్హతలు - పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఉంటే సరిపోతుంది.(నెట్/సెట్ వంటివి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది)
- ప్రవేశ పరీక్ష కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది.
- అర్హత పరీక్ష తర్వాత ఇంటర్వూ కూడా ఉంటుంది.
- పీహెచ్డీ అర్హత పరీక్ష సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్, ఫీజు - ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.1,000, ఇతరులు రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- చివరి తేదీ - చెల్లింపునకు మే 3న చివరి తేదీ
- రూ.500 ఆలస్య రుసుంతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- అధికారిక వెబ్ సైట్ - www.braouonline.in
- వివరాలు కోసం 040-23544741/040-23680411/040-23680498 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తుల గడువు
TS POLYCET 2024 Applications Updates: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తుల(TS POLYCET) గడువు ఇవాళ్టి(ఏప్రిల్ 28)తో ముగియనుంది. ఆలస్య రుసుం లేకుండా ఇప్పటికే గడువు పొడిగించిన రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ, ట్రైనింగ్ బోర్డు… మరోసారి పొడిగించే అవకాశం లేదు. ఫలితంగా అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా…. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించనున్నారు.
పదో తరగతి(SSC Exams) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ 2024కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రూ. 250, ఇతరులు రూ. 500 ఫీజు చెల్లించి… ఇవాళ్టి వరకు (ఏప్రిల్ 28) అప్లికేషన్లను సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష మే 24వ తేదీన జరగనుంది. రాత పరీక్ష నిర్వహించిన పన్నెండు రోజుల్లో ఫలితాలను ప్రకటించునున్నారు.