TRS Plenary: గూలాబీ పండగకు సర్వం సిద్ధం.. -all set for trs plenary at hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Plenary: గూలాబీ పండగకు సర్వం సిద్ధం..

TRS Plenary: గూలాబీ పండగకు సర్వం సిద్ధం..

HT Telugu Desk HT Telugu
Apr 27, 2022 09:19 AM IST

గులాబీ పండగకు సర్వం సిద్ధమైంది. టీఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమానికి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

<p>టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం</p>
టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం (twitter)

హైదరాబాద్ హైటెక్స్ వేదికగా తలపెట్టిన టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. గతేడాది ఏప్రిల్‌లో జరగాల్సిన ద్విదశాబ్ది ప్లీనరీ... కొవిడ్ పరిస్థితుల వల్ల అక్టోబరులో నిర్వహించారు. మళ్లీ 6 నెలల వ్యవధిలోనే ప్లీనరీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులు హెచ్​ఐసీసీకి చేరుకుంటారు. ఉదయం 11 వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఉంటుంది. 11 గంటల 5 నిమిషాలకు పార్టీ అధినేత కేసీఆర్ వేదికపై అమరవీరులకు నివాళి అర్పిస్తారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. కేసీఆర్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 21 ఏళ్ల ప్రస్థానంతోపాటు... ఎనిమిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్లీనరీలో 11 అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్లీనరీ ముగుస్తుంది.

భారీ బందోబస్తు..

సభ చుట్టూ ఎనిమిది పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్‌తో కూడిన భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఉద్యమం, పాలనపరమైన కీలక ఘట్టాలను స్క్రీన్ పై ప్రదర్శిస్తారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వాహనాదారులు ఆంక్షలు పాటించాలని కోరారు. ప్లీనరీకి 2500 పోలీస్ సిబ్బందితో బంబోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక ప్లీనరీకి వచ్చే వారి కోసం భారీ స్థాయిలోనే భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో 33 రకాల తెలంగాణ వంటకాలతో భోజనాలను ఏర్పాటు సిద్ధం చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం