Pedapalli District News : పెద్దపల్లి జిల్లాలో దారుణం - ఆరేళ్ల చిన్నారిపై వలస కూలీ అత్యాచారం, ఆపై హత్య..!-a six year old child was raped by a migrant worker in pedapalli district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pedapalli District News : పెద్దపల్లి జిల్లాలో దారుణం - ఆరేళ్ల చిన్నారిపై వలస కూలీ అత్యాచారం, ఆపై హత్య..!

Pedapalli District News : పెద్దపల్లి జిల్లాలో దారుణం - ఆరేళ్ల చిన్నారిపై వలస కూలీ అత్యాచారం, ఆపై హత్య..!

HT Telugu Desk HT Telugu
Jun 14, 2024 01:52 PM IST

Chiled Raped and killed in Peddapalli : పెద్దపల్లి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఆరేళ్ల చిన్నారిపై వలస కూలీ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెద్దపల్లి జిల్లాలో చిన్నారిపై అఘాయిత్యం
పెద్దపల్లి జిల్లాలో చిన్నారిపై అఘాయిత్యం (image source unshplash.com)

Pedapalli district Crime News : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఆరేళ్ళ పాపను వలస కార్మికుడు ఎత్తుకెళ్ళి అఘాహిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడి గొంతునులిమి ప్రాణం తీశాడు. పసిపాపను చెరిసి ప్రాణం తీసిన కామాంధుడిని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తు ఆందోళన దిగారు. పోలీసులు రంగంలోకి దిగి కామాంధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి లో మమత రైస్ మిల్లులో జరిగిన ఈ ఘటన సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం కు చెందిన సాహితి- మహేష్ దంపతులు నెలరోజుల క్రితం ఇద్దరు ఆడపిల్లలతో కలిసి కాట్నపల్లికి చేరుకుని రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. అదే రైస్ మిల్లులో హామాలీ పనిచేసే ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు బలరాం కన్ను మహేష్ పెద్దకూతురు ఆరేళ్ళ పాప సహస్ర పై పడింది.

గురువారం పని చేసి రాత్రి నిద్రపోగా అందరు నిద్రపోగా బలరాం ఆరేళ్ళ పాపను ఎత్తుకెళ్ళాడు. రైస్ మిల్లు సమీపంలో అత్యాచారానికి పాల్పడి గొంతునులిమి హత్య చేశాడు. తల్లిదండ్రులకు మెల్కొచ్చి చూసే సరికి పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురై అంతట వెతికారు. పాప ఆచూకి లభించకపోవడంతో రైస్ మిల్లులో ఉన్న సీసీ కెమెరాల పుటేజ్ ని పరిశీలించగా బలరాం పాపను ఎత్తుకెళ్ళిన విజువల్స్ రికార్డు అయ్యాయి. సిసి కెమెరా పుటేజ్ ఆదారంగా జలరాం కోసం వెతకగా అప్పటికే ఆతను పారిపోయాడు. ప్రాణం కోల్పోయిన పాపను చూసి పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు.

పాపను ఎత్తుకెళ్ళిన నిందితుడు

తల్లిదండ్రుల పక్కలో పడుకున్న పాపను కామాందుడు బలరాం ఎత్తుకెళ్ళాడు. పని చేసి అలసిపోయిన వలస కూలీలు ఓ వైపు మహేష్ దంపతులు ఇద్దరు పిల్లలతో మరో వైపు పడుకున్నారు. రాత్రి వర్షం రావడంతో రూమ్ లో కి వెళ్ళారు. కానీ కరెంట్ లేక పోవడంతో ఉక్కపోతకు పిల్లలను నిద్రపోకపోవడంతో మళ్ళీ బయటకు వచ్చి పడుకున్నామని పాప తల్లి సాహితి తెలిపారు. గాఢ నిద్రలో ఉండగా పక్కలో ఉన్న పసిపాపను ఎత్తుకెళ్ళి ఇలా చేశాడని బోరున విలపిస్తు తెలిపారు. పసిపాపపై అఘాహిత్యానికి పాల్పడిన కామాంధుడిని ఎన్ కౌంటర్ చేయాలని కన్నవారితోపాటు స్థానికులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

పోలీసుల అదుపులో నిందితుడు

పసిపాపపై హమాలీ కార్మికుడు అఘాహిత్యానికి పాల్పడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మహిళా సంఘాలతోపాటు ప్రజాసంఘాలు ఘటన స్థలానికి చేరుకుని కామాందుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పాప మృతదేహానికి పోస్ట్ మార్టమ్ కోసం సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బలరాంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టామని, నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడుతామని సుల్తానాబాద్ సిఐ తెలిపారు.

రిపోర్టింగ్ - HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి.

Whats_app_banner