Father Sold Son: లక్ష రూపాయలకు కన్న కొడుకునే విక్రయించిన తండ్రి.. సంగారెడ్డిలో దారుణం
Father Sold Son: లక్ష రూపాయలకు రెండేండ్ల వయసున్న కన్న కొడుకునే తండ్రి విక్రయించిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Father Sold Son: సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. లక్ష రూపాయలకు రెండేండ్ల వయసున్న కన్న కొడుకునే తండ్రి విక్రయించడం వెలుగు చూసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనలో తండ్రితో పాటు అతనికి సహకరించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఆశిక్ తులసీరామ్,మాధురి దంపతులు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో నివాసం ఉంటూ,స్థానిక పరిశ్రమలో కార్మికులుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి రెండు సంవత్సరాల కుమారుడు నాక్ష్ ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మాధురి కుమారుడిని తీసుకొని మహారాష్ట్ర కు వెళ్ళింది. రెండు రోజుల క్రితం తులసీరామ్ వెళ్లి భార్యకు చెప్పకుండా కొడుకుని తీసుకొని దోమడుగుకు వచ్చాడు. ఈక్రమంలో మాధురి సొమవారం దోమడుగు చేరుకొని కొడుకు ఎక్కడ ఉన్నాడని భర్తని నిలదీసింది.
తండ్రితో సహా నలుగురు అరెస్ట్ …
తులసీరామ్ సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన మాధురి పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు తులసీరామ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా కుమారుడిని విక్రయించానని చెప్పాడు.
దోమడుగులో గడ్డిపెద్దపూర్ గ్రామానికి చెందిన దంపతులు శేరి విఠల్,రాజేశ్వరీ సహకారంతో నిజాంపేట్ మండలం కల్వకంట్ల గ్రామానికి చెందిన కల్పన,స్వామి దంపతులకు లక్ష రూపాయలకు బాలుడిని విక్రయించినట్లు తెలిపారు.
దీంతో తులసీరామ్ తో పాటు సహకరించిన శేరి విఠల్,రాజేశ్వరీని ,బాలున్ని స్వీకరించిన కల్పన,స్వామి దంపతులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు. తల్లి,బాలున్ని సంగారెడ్డిలోని శిశు గృహకు తరలించామని తెలిపారు.
మెడికో ఆత్మహత్యలో కొత్త కోణం…
కారులో ఆత్మహత్య చేసుకున్న మెడికో మరణం వెనుక కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో మెడికో రచనా రెడ్డికి కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరిగినట్టు గుర్తించారు. నిశ్చితార్థం చేసుకున్న యువకుడితో అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతనితో జరిగిన వాగ్వాదం నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
sప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించాలి…
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని సిఐ రామకృష్ణ తెలిపారు. వాహనదారులు, ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని,చట్ట ప్రకారం నేరమని, తల్లితండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వదని తెలిపారు.
రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని,పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు. ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు. జరిమానా ఫైన్లు వేయడం మా అభిమతం కాదని ప్రమాదాల నివారణ గురించి, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు, పాటించకుండా హెల్మెట్ పెట్టుకోకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి గులాబీ పువ్వులు అందజేశారు