Virat Kohli Party : రాత్రంతా దావత్ చేసుకుని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ-virat kohli party all night and scored 250 in the next day revealed ishant sharma ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Party : రాత్రంతా దావత్ చేసుకుని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ

Virat Kohli Party : రాత్రంతా దావత్ చేసుకుని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ

Anand Sai HT Telugu
Jun 26, 2023 12:47 PM IST

Virat Kohli Party : ఒకప్పటి విరాట్ కోహ్లీ వేరు.. ఇప్పుడున్న విరాట్ కోహ్లీ వేరు. తక్కువ వయసులోనే సక్సెస్ చూసిన విరాట్ కోహ్లీ.. పార్టీలంటూ మెుదట్లో ఎంజాయ్ చేసేవాడు. తర్వాత వెళ్తున్న దారి తప్పు అని తెలుసుని ఫిట్ నెస్ మీద ఫోకస్ చేశాడు. తాజాగా ఇషాంత్ శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AFP)

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులతో పాటు భారత జట్టు ఛేజింగ్ మాస్టర్, రన్ మెషీన్‌గా ప్రసిద్ధి చెందాడు. 2008లో విరాట్ కోహ్లీ 19 ఏళ్ల వయసులో భారత జట్టుతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. కాలక్రమేణా వైట్‌బాల్ క్రికెట్‌లో అత్యుత్తమంగా స్థిరపడ్డాడు.

భారత జట్టు అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma), విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితులలో ఒకరు. ఇప్పుడు ఇషాంత్ శర్మ కోహ్లీతో తన సంబంధం గురించి మాట్లాడాడు. ఇషాంత్ శర్మ తన అండర్-19(Under 19) రోజుల నుండి కొన్ని పాత క్షణాలను గుర్తుచేసుకున్నాడు. విరాట్ కోహ్లీ రాత్రంతా కనిపించకుండా పోయి.. మరుసటి రోజు కోల్‌కతాలో 250 పరుగులు చేశాడని వెల్లడించాడు.

ఢిల్లీలో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ పార్టీ, టాటూలంటే క్రేజ్ తో ఉండేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కోహ్లీని చూస్తున్నట్లు ఇషాంత్ శర్మ తెలిపాడు. '2012 నుండి విరాట్ కోహ్లి తన ఆహారాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు. భారత క్రికెట్‌లో అందరికంటే ఫిట్‌నెస్ తో ముందువరుసలో ఉన్నాడు. ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండాలి.' అని ఇషాంత్ అన్నాడు.

'మేం కోల్‌కతాలో అండర్-19 మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు విరాట్ కోహ్లీ రాత్రంతా కనిపించకుండా వెళ్లాడు. పార్టీకి వెళ్లినట్టుగా ఉన్నాడు. కానీ మరుసటి రోజు 250 పరుగులు చేశాడు. ఇది అద్భుతం.' అని ఇషాంత్ చెప్పాడు.

విరాట్ కోహ్లీకి చోలే భాతురే(chole bhature) అంటే ఇష్టం. తనకు ఇష్టమైన ఆహారం అని గతంలోనే వెల్లడించాడు. కానీ ఇషాంత్ శర్మ ప్రకారం, విరాట్ కోహ్లీ 2012 నుండి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే దీన్ని తిన్నాడు. 'ఢిల్లీ ప్రజలు చోలే భాతురేను చాలా ఇష్టపడతారు. కానీ విరాట్ కోహ్లీ క్రికెట్, ఫిట్‌నెస్ కోసం అన్నింటినీ వదులుకున్నాడు. 2012 నుండి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చోలే భాతురే తినడం చూశాను.' అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Whats_app_banner