Virat Kohli Net Practice: నెట్స్‌లో స్పిన్నర్లను చితకబాదిన విరాట్ కోహ్లి.. వీడియో
Virat Kohli Net Practice: నెట్స్‌లో స్పిన్నర్లను చితకబాదాడు విరాట్ కోహ్లి. ఆసియా కప్ కోసం దుబాయ్‌లో ఉన్న టీమిండియా నెట్ ప్రాక్టీస్ చేయగా.. స్పిన్నర్లు జడేజా, అశ్విన్, చహల్‌ల బౌలింగ్‌లో కోహ్లి చెలరేగిపోయాడు.
Virat Kohli Net Practice: ఆసియా కప్ కోసం గట్టిగానే సిద్ధమవుతున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అతడు ఈ మెగా టోర్నీ కోసం టీమ్‌లోకి తిరిగి వచ్చాడు. ఆదివారం (ఆగస్ట్ 28) పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం అతడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి.. ఈ నెల రోజుల గ్యాప్‌లో తన బలహీనతలను అధిగమించినట్లు చెప్పాడు.
అది నెట్ ప్రాక్టీస్‌లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా స్పిన్ బౌలర్లు జడేజా, చహల్, అశ్విన్‌ల బౌలింగ్‌లో కోహ్లి చెలరేగి ఆడాడు. ముందుకొచ్చి భారీ షాట్లు కొట్టాడు. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఐపీఎల్‌తోపాటు ఇంగ్లండ్ సిరీస్‌లో కాస్త డిఫెన్సివ్‌గా కనిపించిన విరాట్.. ఇప్పుడు నెట్స్‌లో తన మైండ్‌సెట్ మార్చుకొని చాలా దూకుడుగా ఆడాడు.
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌లాంటి టీమ్‌పై గెలవాలంటే కోహ్లి ఫామ్‌లోకి రావడం టీమ్‌కు చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ నెట్స్‌లో ఇలా పాజిటివ్‌గా ఆడటం గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఆసియా కప్ కోసం యూఏఈ బయలు దేరే ముందు స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో కోహ్లి మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌లో తాను పదే పదే చేసిన పొరపాటును అధిగమించడానికి ప్రయత్నించినట్లు చెప్పాడు.
అంతేకాదు తనను విమర్శిస్తున్న వారికి కూడా అతడు సమాధానమిచ్చాడు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం లేకుండా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ స్థాయికి చేరడం అసాధ్యమని కోహ్లి చెప్పాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పైనే తన 100వ టీ20 మ్యాచ్ ఆడబోతున్న విరాట్ కోహ్లి.. ఏం చేస్తాడో చూడాలి.
సంబంధిత కథనం