Kohli Meets Babar: దుబాయ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను కలిసిన కోహ్లి
Kohli Meets Babar: దుబాయ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను విరాట్ కోహ్లి కలిసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను బుధవారం (ఆగస్ట్ 24) రాత్రి బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
Kohli Meets Babar: ఆసియా కప్ కోసం దుబాయ్ వెళ్లిన టీమిండియా ప్లేయర్స్ అక్కడికి వచ్చిన మిగతా టీమ్స్ ప్లేయర్స్‌ను కలిశారు. వాళ్లను ఆప్యాయంగా పలకరించారు. నవ్వుతూ సరదాగా గడిపారు. ఈ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. బుధవారం రాత్రి తన ట్విటర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.
ఇందులో గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయడానికి వెళ్లిన ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అక్కడే ఉన్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ ప్లేయర్స్‌ను కలవడం చూడొచ్చు. ప్రాక్టీస్ కోసం ఇండియన్ టీమ్ ప్లేయర్స్ గ్రౌండ్‌లోకి వస్తున్నప్పటి నుంచీ అక్కడి ప్రత్యర్థి ప్లేయర్స్‌ను కలవడం, తర్వాత టీమ్ మీటింగ్, ప్రాక్టీస్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ మహ్మద్ నబీని యుజువేంద్ర చహల్ హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నబీ, రషీద్ ఖాన్‌లతో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి కూడా కాసేపు ముచ్చటించారు. ఇక ఇందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను విరాట్ కోహ్లి కలవడమే. నవ్వుతూ అతని వైపు వెళ్లి విరాట్.. బాబర్ భుజంపై చేయి వేసి పలుకరించాడు.
విరాట్ కోహ్లిని ఎంతగానో ఆరాధించే బాబర్.. ఈ గ్రీటింగ్స్‌తో చాలా ఆనందంగా కనిపించాడు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా బాబర్ ఆజం చాలాసేపు విరాట్ కోహ్లితో మాట్లాడాడు. మిగతా పాక్ ప్లేయర్స్ కూడా కోహ్లి, ధోనీలతో మాట్లాడి వాళ్ల విలువైన సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో కోహ్లి, బాబర్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసినా.. చివరికి పాకిస్థానే గెలిచింది.
ఆసియా కప్ ఈ నెల 27న ప్రారంభం కానుండగా.. ఈ నెల 28న అంటే ఆదివారం ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లికి ఇది వందో టీ20 మ్యాచ్ కానుండటం విశేషం. గతేడాది వరల్డ్‌కప్‌లో తొలిసారి ఇండియాపై పాక్ గెలిచింది. ఆ తర్వాత ఈ రెండు టీమ్స్ ఆడనుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
సంబంధిత కథనం