Sunrisers Hyderabad new captain: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు
Sunrisers Hyderabad new captain: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 23) ట్విటర్ ద్వారా ఆ ఫ్రాంఛైజీ అనౌన్స్ చేసింది.
Sunrisers Hyderabad new captain: ఐపీఎల్లో ఇన్నాళ్లూ కెప్టెన్ లేని టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్. గతేడాది కేన్ విలియమ్సన్ ను ఆ టీమ్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకూ మరో కెప్టెన్ ను అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా ఈ సస్పెన్స్ కు ఆ ఫ్రాంఛైజీ తెరదించింది. టీమ్ కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా బ్యాటర్ ఏడెన్ మార్‌క్రమ్ ను నియమించింది.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఆ ఫ్రాంఛైజీ అనౌన్స్ చేసింది. "ఎదురుచూపులకు ఇక ముగింపు పలుకుతున్నాం. ఆరెంజ్ ఆర్మీ, మన కొత్త కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ కు హలో చెప్పండి" అంటూ సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. గత వేలంలో ఇండియన్ స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ను సొంతం చేసుకున్న తర్వాత అతనికి కెప్టెన్సీ ఇస్తారా అన్న చర్చ కూడా సాగింది.
అయితే చివరికి మార్‌క్రమ్ వైపే మొగ్గు చూపింది. గతంలో మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. మార్‌క్రమ్ ప్రస్తుతం సౌతాఫ్రికా లీగ్ ఎస్ఏ20లో సన్‌రైజర్స్ టీమ్ అయిన ఈస్టర్న్ కేప్ కెప్టెన్ గా ఉన్నాడు. అంతేకాదు తొలిసారి జరిగిన ఈ లీగ్ లో టీమ్ ను విజేతగా నిలిపాడు. దీంతో ఐపీఎల్లోనూ సన్‌రైజర్స్ కెప్టెన్సీని అతనికే అప్పగించాలని నిర్ణయించారు.
అటు ఎస్ఏ20లో మార్‌క్రమ్ బ్యాట్ తోనూ రాణించాడు. టోర్నీ మొత్తంలో 336 రన్స్ చేశాడు. అందులో సెమీఫైనల్లో చేసిన సెంచరీ కూడా ఉంది. అంతేకాదు 11 వికెట్లు కూడా తీయడం విశేషం. గతేడాది ఐపీఎల్లోనూ మార్‌క్రమ్ రాణించాడు. గత సీజన్ లో అతడు 47.63 సగటుతో 381 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇక గత ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను సన్ రైజర్స్ టీమ్ రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అతని రాకతో ఆ టీమ్ బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. అతనికి తోడు మయాంక్ కూడా వచ్చాడు.
సన్ రైజర్స్ టీమ్ ఇదే
ఏడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్ ఫరూకీ, గ్లెన్ ఫిలిప్స్, కార్తీక్ త్యాగి, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠీ, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకీల్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండె, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్
సంబంధిత కథనం