Kane Williamson on IPL: సన్‌రైజర్స్‌ తనను రిలీజ్‌ చేసిన తర్వాత ఐపీఎల్‌పై విలియమ్సన్‌ సంచలన కామెంట్స్‌-kane williamson on ipl says he wants to play next season ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kane Williamson On Ipl: సన్‌రైజర్స్‌ తనను రిలీజ్‌ చేసిన తర్వాత ఐపీఎల్‌పై విలియమ్సన్‌ సంచలన కామెంట్స్‌

Kane Williamson on IPL: సన్‌రైజర్స్‌ తనను రిలీజ్‌ చేసిన తర్వాత ఐపీఎల్‌పై విలియమ్సన్‌ సంచలన కామెంట్స్‌

Hari Prasad S HT Telugu
Nov 16, 2022 06:58 PM IST

Kane Williamson on IPL: సన్‌రైజర్స్‌ తనను రిలీజ్‌ చేసిన తర్వాత ఐపీఎల్‌పై కేన్‌ విలియమ్సన్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. ఇండియాతో సిరీస్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడుతూ తొలిసారి దీనిపై స్పందించాడు.

కేన్ విలియమ్సన్
కేన్ విలియమ్సన్ (BCCI-IPL)

Kane Williamson on IPL: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చాన్నాళ్లుగా తమతో ఉన్న కేన్‌ విలియమ్సన్‌ను రిలీజ్‌ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. టీమ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఉన్న కేన్‌ను వదిలించుకొని మినీ ఐపీఎల్‌ వేలం కోసం భారీగానే డబ్బు మిగుల్చుకుంది సన్‌రైజర్స్‌ టీమ్‌. హైదరాబాద్‌ టీమ్‌ తరఫున విలియమ్సన్‌ 8 సీజన్ల పాటు ఆడాడు.

ఇప్పుడతన్ని హైదరాబాద్‌ వదిలేయడంతో మరోసారి వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ తనను రిలీజ్‌ చేయడంపై విలియమ్సన్‌ తొలిసారి స్పందించాడు. ఇండియాతో సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన అతడు.. దీనిపై స్పందించాడు. సన్‌రైజర్స్‌ వదిలేసినా.. తాను 2023 ఐపీఎల్‌ సీజన్‌లో ఆడాలని అనుకుంటున్నట్లు విలియమ్సన్‌ చెప్పాడు.

టీ20 భవిష్యత్తుపై పునరాలోచన చేస్తారా అని మీడియా ప్రశ్నించగా.. అదేం లేదంటూ విలియమ్సన్‌ చెప్పాడు. "ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాంపిటీషన్స్‌ జరుగుతున్నాయి. అందులో ఐపీఎల్‌లాంటి కాంపిటీషన్‌లో కచ్చితంగా ఆడాలనుకుంటా. ప్లేయర్స్‌ వివిధ టీమ్స్‌కు ఆడుతుంటారు. చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. అందుకే నేను అన్ని ఫార్మాట్లు ఆడాలని అనుకుంటాను" అని విలియమ్సన్‌ చెప్పాడు.

నిజానికి తనను రిలీజ్‌ చేయడంపై కొన్ని రోజుల కిందటే సన్‌రైజర్స్‌ టీమ్‌ సంప్రదించిందని వెల్లడించాడు. "ఇలాంటివి సహజమే. నేను సన్‌రైజర్స్‌ టీమ్‌లో బాగా ఎంజాయ్ చేశాను. చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అధికారికంగా తనను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు ఆశ్చర్యమేమీ కలగలేదు" అని కేన్‌ విలియమ్సన్‌ చెప్పాడు.

సన్‌రైజర్స్‌ తరఫున విలియమ్సన్ 76 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 46 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక మొత్తంగా 2101 రన్స్‌ చేశాడు. ఐపీఎల్‌లో 2015లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో విలియమ్సన్‌ అరంగేట్రం చేశాడు.

WhatsApp channel

టాపిక్