Sania Mirza Insta Followers: సానియాకు పెరిగిన ఫాలోవర్లు.. విడాకుల తర్వాత ఎంత పెరిగారో తెలుసా?-sania mirza insta followers increased after divorce with shoaib malik sports news in telugu ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza Insta Followers: సానియాకు పెరిగిన ఫాలోవర్లు.. విడాకుల తర్వాత ఎంత పెరిగారో తెలుసా?

Sania Mirza Insta Followers: సానియాకు పెరిగిన ఫాలోవర్లు.. విడాకుల తర్వాత ఎంత పెరిగారో తెలుసా?

Hari Prasad S HT Telugu
Feb 01, 2024 05:57 PM IST

Sania Mirza Insta Followers: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకుల తర్వాత సానియా మీర్జాకు ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్లు విపరీతంగా పెరగడం విశేషం. ప్రస్తుతం ఆమె ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్లకు చేరువైంది.

తన మాజీ భర్త షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా
తన మాజీ భర్త షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా

Sania Mirza Insta Followers: హైదరాబాదీ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో ఈ మధ్యే విడాకులు తీసుకున్న విషయం తెలుసు కదా. అది కూడా షోయబ్ మూడో పెళ్లి చేసుకుంటేగానీ ఈ విషయం అధికారికంగా బయటకు రాలేదు. అయితే ఈ విడాకుల తర్వాత సానియాకు ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్లు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పెరిగినట్లు గుర్తించారు.

సానియాకు పెరుగుతున్న ఫాలోయింగ్

సానియా మీర్జాకు ఇన్‌స్టాగ్రామ్ లో ప్రస్తుతం (ఫిబ్రవరి 1) ఉన్న ఫాలోవర్ల సంఖ్య 12.9 మిలియన్లు. ఇండియా చూసిన టాప్ టెన్నిస్ ప్లేయర్స్ లో ఒకరిగా ఆమెకు చాలా క్రేజ్ ఉంది. అయితే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు ఈ మధ్య విడాకులు ఇచ్చిన తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సడెన్ గా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య వేగంగా పెరిగింది.

గత నెల రోజుల్లోనే సానియా ఫాలోవర్ల సంఖ్య సుమారు 3 లక్షల వరకూ పెరిగినట్లు హైప్‌ఆడిటర్ రిపోర్ట్ వెల్లడించింది. అందులోనూ షోయబ్ మాలిక్ గత జనవరి 20న పాక్ నటి సనా జావెద్ ను మూడో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఫాలోవర్ల సంఖ్య మరింత పెరగడం గమనార్హం. ఇండియాలోనే కాదు.. పాకిస్థాన్ నుంచి ఆమెకు ఫాలోవర్లు పెరుగుతున్నట్లు హైప్ ఆడిటర్ గుర్తించింది.

షోయబ్ ఫ్యామిలీ కూడా సానియా వైపే..

నిజానికి షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడం అతని కుటుంబానికి కూడా నచ్చలేదని వార్తలు వస్తున్నాయి. వాళ్లు కూడా సానియా వైపే నిలిచి అతని పెళ్లికి హాజరు కాలేదని సమాచారం. 2010లో సానియాను పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. గత మూడు, నాలుగేళ్లుగా సనా జావెద్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో చాలా రోజులుగా సానియా, షోయబ్ విడాకుల వార్తలు మీడియాలో వచ్చాయి.

అయితే ఈ వార్తలపై వీళ్లు ఎప్పుడూ నోరు మెదపలేదు. ఇప్పుడు కూడా షోయబ్ మాలిక్ మూడో పెళ్లి వార్త బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాతే సానియాతో విడాకులు ఖాయమని తేలింది. అంతకుముందే షోయబ్ మాలిక్ ఫొటోలు అన్నింటినీ సానియా తన ఇన్‌స్టా నుంచి తొలగించింది. అప్పుడే ఈ జంట ఇక దాదాపు విడిపోయినట్లే అని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.

ఇప్పటికి కూడా సానియా తాను షోయబ్ తో దుబాయ్ లో కలిసి ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటోంది. తన కొడుకు పూర్తి కస్టడీ కూడా తానే తీసుకుంది. ఈ విడాకుల నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమె.. ఈ మధ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ కు కూడా హాజరైంది. సానియా గతేడాది ఇదే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తన చివరి గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. సింగిల్స్ నుంచి ఎప్పుడో తప్పుకున్న ఆమె.. డబుల్స్ లో చాలా కాలం కొనసాగింది. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కూడా అందుకుంది.

WhatsApp channel