Mahela Jayawardene on Jadeja: జడేజా జట్టులో లేకపోవడం భారత్‌కు నష్టమే.. టీ20 ప్రపంచకప్ ముందు జయవర్దనే వ్యాఖ్యలు-mahela jayawardene says ravindra jadeja injury ahead of t20 world cup it s massive loss ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mahela Jayawardene On Jadeja: జడేజా జట్టులో లేకపోవడం భారత్‌కు నష్టమే.. టీ20 ప్రపంచకప్ ముందు జయవర్దనే వ్యాఖ్యలు

Mahela Jayawardene on Jadeja: జడేజా జట్టులో లేకపోవడం భారత్‌కు నష్టమే.. టీ20 ప్రపంచకప్ ముందు జయవర్దనే వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Sep 17, 2022 05:46 PM IST

Mahela Jayawardene About Ravindra Jadeja: రవీంద్ర జడేజా జట్టులో లేకపోవడం టీమిండియాకు భారీ నష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్దనే అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్ కంటే ముందు ఈ విధంగా జరగడం ఆ జట్టుపై ప్రభావితం చేస్తుందని తెలిపడు.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (REUTERS)

Mahela Jayawardene on Ravindra Jadeja: వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనం చేయనున్నారు. ఇదే సమయంలో ఆసియా కప్ సమయంలో గాయపడిన రవీంద్ర జడేజాను ఈ జట్టులో ఎంపిక చేయలేదు. పొట్టి ప్రపంచకప్ జట్టు ఎంపికపై ఇప్పటికే పలువురు మాజీలు తమ స్పందనలు తెలియజేయగా.. తాజాగా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే స్పందించారు. రవీంద్ర జడేజా జట్టులో లేకపోవడం టీమిండియాకు భారీ నష్టమని తెలిపాడు.

"టీమిండియాకు ఇది పెద్ద సవాలు. ఎందుకంటే జడేజా ఐదో స్థానంలో బాగా రాణిస్తున్నాడు. అతడు ఆ స్థానంలో బాగా ఆడుతున్నాడు. అతడితో పాటు హార్దిక్-జడేజా టాప్-6 మెరుగ్గా ఉంది. ఇద్దరు ఆల్ రౌండర్ల ఆప్షన్లతో భారత బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. జడేజాలో లేకపోవడం టీమిండియాకు ఇబ్బందే. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ కొరత కనిపిస్తోంది. ఒకవేళ కావాలనుకుంటే దినేశ్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్‌ను తీసుకోవాల్సి వస్తుంది. పంత్‌ను 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాల్సి ఉంటుంది. ఎలాగైన జడేజా జట్టులో లేకపోవడం భారత్‌కు భారీ నష్టమనే చెప్పాలి." అని జయవర్దనే అభిప్రాయపడ్డాడు.

అయితే ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ పుంజుకోవడం టీమిండియాకు బాగా కలిసొచ్చే అంశమని జయవర్ధనే తెలిపాడు. "అతడు ఫామ్ పుంజుకోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. భారీ స్కోర్లు నమోదు చేయనప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో ఎల్లప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది. గత 12 నెలల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. అతడికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అందుకే జట్టు యాజమాన్యం పదే పదే విశ్రాంతి ఇచ్చారు. అవసరమైనప్పుడు విశ్రాంతి ఇస్తున్నప్పటికీ పరుగులు చేయకపోవడం కష్టతరంగా ఉంటుంది. అయితే ఆసియా కప్‌లో కోహ్లీ తిరిగి గాడిలో పడ్డాడు. స్థిరత్వంతో ఆడాడు. అంతేకాకుండా శతకంతో ఆకట్టుకున్నాడు." అని జయవర్దనే తెలిపాడు.

టీ20 ప్రపంచకప్ కంటే ముందు ఆస్ట్రేలియాతో టీమిండియా సెప్టెంబరు 20 నుంచి మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ మంగళవారం నాడు మొహాలీ వేదికగా జరగనుండగా.. సెప్టెంబరు 23న రెండో మ్యాచ్ నాగ్‌పుర్ వేదికగా జరగనుంది. సెప్టెంబరు 25 ఆదివారం నాడు హైదరాబాద్ వేదికగా మూడో మ్యాచ్ నిర్వహించనున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం