IPL Auction 2022 | గాయంతో ఐపీఎల్ కు దూరం..అయినా 8కోట్లకు అమ్ముడుపోయాడు-jofra archer bought by mumbai indians in ipl auction 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Auction 2022 | గాయంతో ఐపీఎల్ కు దూరం..అయినా 8కోట్లకు అమ్ముడుపోయాడు

IPL Auction 2022 | గాయంతో ఐపీఎల్ కు దూరం..అయినా 8కోట్లకు అమ్ముడుపోయాడు

Nelki Naresh HT Telugu
Feb 13, 2022 07:58 PM IST

ఐపీఎల్ మెగా వేలంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను 8 కోట్లకు ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే మోచేతి గాయం కారణంగా ఈ ఏడాది మార్చిలో జరిగే ఐపీఎల్ కు జోఫ్రా ఆర్చర్ దూరం కానున్నాడు.

<p>జోఫ్రా ఆర్చర్&nbsp;</p>
జోఫ్రా ఆర్చర్ (Twitter)

ఐపీఎల్ మ వేలంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కు వింత అనుభవం ఎదురైంది. మెగా వేలంలో అతడిని 8 కోట్లకు ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే మోచేతి గాయం కారణంగా ఈ ఏడాది మార్చిలో జరిగే ఐపీఎల్ లో జోఫ్రా ఆర్చర్ ఆడటం లేదు.  ఆ విషయాన్నిఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ముందుగానే ప్రకటించింది. అయినప్పటికీ ఈ ఫాస్ట్ బౌలర్ ను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజ్ లు పోటీపడ్డాయి. జోఫ్రా ఆర్చర్ ను  కొనుగోలు చేయడం కోసం హైదరాబాద్ సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న ముంబయి  ఇండియన్స్ చివరకు 8 కోట్ల ధరకు అతడిని దక్కించుకున్నది. ఐపీఎల్ వేలంలో తనకు భారీ ధర పలకడం పట్ల జోఫ్రా ఆర్చర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో సర్ ప్రైజ్ ఎమోజీని పోస్ట్ చేశారు. మేచేతి గాయంతో బాధపడుతున్న జోఫ్రా ఆర్చర్ కు గత ఏడాది డిసెంబర్ లో సర్జరీ జరిగింది. వైద్యుల సూచన మేరకు వేసవి తర్వాతే అతడు తిరిగి క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టే అవకాశం ఉండటంతో 2022 ఐపీఎల్ సీజన్ కు జోఫ్రా అందుబాటు లో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి తెలిపింది. 2023, 24 సీజన్స్ ను దృష్టిలో పెట్టుకొని చివరి నిమిషంలో అతడి పేరును రిజిస్టర్ చేశారు. వేలం జరుగుతున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ కోసం ఫ్రాంచైజ్ లు పోటీపడి ధరను పెంచుతూ పోతుండటంతో ఈ సీజన్ కు అతడు అందుబాటులో ఉండడనే విషయాన్ని ఐపీఎల్ ఆక్షనర్ చారుశర్మ గుర్తుచేయడం గమనార్హం. 

Whats_app_banner

సంబంధిత కథనం