Gt vs Kkr: 21 బాల్స్‌లోనే విజయ్ శంకర్ హాఫ్ సెంచరీ - కోల్‌కతా ముందు గుజరాత్ భారీ టార్గెట్
Gt vs Kkr: విజయ్ శంకర్, సాయిసుదర్శన్ బ్యాటింగ్ మెరుపులతో కోల్‌కతా ముందు గుజరాత్ 205 పరుగులు భారీ టార్గెట్‌ను విధించింది.
Gt vs Kkr: విజయ్ శంకర్‌తో పాటు సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్‌టైటాన్స్ భారీ స్కోరు చేసింది. ఆరంభంలో సాయిసుదర్శన్ బ్యాటింగ్‌లో మెరవగా చివరలో మెరుపు ఇన్నింగ్స్‌తో గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 39 పరుగులతో ఆకట్టుకున్నాడు.
వృద్ధిమాన్ సాహా 17 పరుగులకే ఔట్ అయినా శుభ్‌మన్‌గిల్, సాయిసుదర్శన్ కలిసి గుజరాత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. శుభమన్ 31 బాల్స్‌లో ఐదు ఫోర్లు, 1 సిక్సర్‌తో 39 రన్స్ చేసి ఔటయ్యాడు.
అభినవ్ మనోహర్ కూడా వెంటనే పెవిలియన్ చేరినా మరోవైపు ఒంటరి పోరాటంతో సుదర్శన్ ఆకట్టుకున్నాడు. 34 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. దూకుడుగా ఆడుతోన్న అతడిని తెలివైన బాల్‌తో నరైన్ బోల్తా కొట్టించాడు.
సాయి సుదర్శన్ 38 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 రన్స్ చేశాడు. చివరలో విజయ్ శంకర్ కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.21 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసే సరికి 24 బాల్స్‌లోనే 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 63 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
కోల్‌కతా బౌలర్లలో నరైన్ మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. నరైన్ 3 వికెట్లు తీసుకోగా, సుయాశ్ శర్మకు ఒక వికెట్ దక్కింది. కాగా ఈ మ్యాచ్‌కు అనారోగ్య సమస్యలతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. అతడి స్థానంలో రషీద్‌ఖాన్ కెప్టెన్ బాధ్యతల్ని స్వీకరించాడు.