Sehwag on KL Rahul: సంజూ శాంసన్ కంటే రాహుల్ చాలా మంచి బ్యాటర్: సెహ్వాగ్
Sehwag on KL Rahul: సంజూ శాంసన్ కంటే రాహుల్ చాలా మంచి బ్యాటర్ అని అన్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. బుధవారం (ఏప్రిల్ 19) రాజస్థాన్, లక్నో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ రెండు జట్ల కెప్టెన్ల గురించి వీరూ స్పందించాడు.
Sehwag on KL Rahul: ఐపీఎల్లో బుధవారం (ఏప్రిల్ 19) ఓ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతోంది. పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్ కోసం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు టీమ్స్ లో ఎవరు టాప్ లోకి వెళ్తారన్నది పక్కన పెడితే.. ఈ టీమ్స్ కెప్టెన్లయిన సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ లలో ఎవరు బెటర్ అనే చర్చపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
ఇండియన్ టీమ్ లో స్థానాన్ని సుస్థిరం చేసుకునే విషయంలో సంజూ కంటే రాహుల్ చాలా బెటర్ అని వీరూ అనడం విశేషం. అతని కామెంట్స్ సంజూ అభిమానులను నిరాశ పరచవచ్చు. కానీ అది ఎందుకో కూడా సెహ్వాగ్ వివరించాడు. క్రిక్‌బజ్ షోలో పాల్గొన్న వీరూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
"ఇండియన్ టీమ్ లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంపై మాట్లాడితే మాత్రం సంజూ శాంసన్ కంటే కేఎల్ రాహుల్ చాలా బెటర్. అతడు టెస్టు క్రికెట్ ఆడాడు. చాలా దేశాల్లో సెంచరీలు చేశాడు. వన్డేల్లోనూ ఓపెనర్ గా, మిడిలార్డర్ బ్యాటర్ గా రాణించాడు. టీ20ల్లోనూ మంచి స్కోర్లు సాధించాడు" అని సెహ్వాగ్ అన్నాడు. దీంతోపాటు ఈ ఐపీఎల్లో అతడు తిరిగి ఫామ్ లోకి వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు.
"కేఎల్ రాహుల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. గత మ్యాచ్ లో అతడు రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ అంచనాలకు తగినట్లుగా లేదన్నది నిజమే. కానీ అతని ఫామ్ అనేది మంచి సంకేతం. రాజస్థాన్ లో బౌల్ట్ ఒక్కడే మంచి పేస్ తో వేసే డేంజరస్ బౌలర్. స్పిన్నర్లు ఉన్నారు కానీ.. కేఎల్ రాహుల్ చాలాసేపు ఆడితే మాత్రం వాళ్ల బౌలింగ్ లోనూ బాదుతాడు" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం