Ravi Bishnoi Stunning Catch: రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే-ravi bishnoi pulls off amazing fielding effort it stuns everyone ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Bishnoi Stunning Catch: రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే

Ravi Bishnoi Stunning Catch: రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే

Maragani Govardhan HT Telugu
Apr 29, 2023 12:05 PM IST

Ravi Bishnoi Stunning Catch: లక్నో ఆటగాడు రవి బిష్ణోయ్ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అయితే వెంటనే అది చేజారింది. క్యాచ్ వదిలేసిన అతడి ప్రయత్నానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్
రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్

Ravi Bishnoi Stunning Catch: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 257 పరుగుల భారీ స్కోరున సాధించిన లక్నో.. 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్‌తోనే కాదు.. ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా లక్నో ప్లేయర్ రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన రవి భిష్ణోయ్ తన ప్రదర్శన రాణించాడు.

పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆవేష్ ఖాన్ వేసిన బంతిని లియామ్ లివింగ్‌స్టోన్ బలంగా పాయింట్ ఏరియాలో బాదాడు. అక్కడ కాచుకుని ఉన్న రవికి కాస్త దూరంగా బంతి వెళ్తోంది. క్షణాల వ్యవధిలో తేరుకున్న రవి భిష్ణోయ్.. ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. కానీ డైవ్ చేసి మరి పట్టుకున్న బంతిని ఎక్కువ సేపు చేతుల్లో ఉంచుకోలేకపోయాడు. బాల్ మైదానంలో పడిపోయింది. క్యాచ్ చేజారినప్పటి రవి ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకుంటున్నారు. అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన అంటూ కొనియాడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రవి బిష్ణోయ్ ప్రయత్ననాన్ని అభినందిస్తున్నారు. సూపర్ మ్యాన్ లెవల్లో దూకాడాని ప్రశంసిస్తున్నారు. కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేశాడని అతడిపై సానుకూలంగా కామెంట్లు పెడుతున్నారు.

మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇలాంటి సమయంలో వన్డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన అథర్వ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 66 పరుగులు సాధించి లక్నో బౌలర్లను భయపెట్టాడు. మొత్తంగా 19.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్ 4 వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్ 3 వికెట్లతో రాణించాడు. రవి భిష్ణోయ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాటర్లలో కైల్ మేయర్స్(54), మార్కస్ స్టోయినీస్(72) అర్ధశతకాలతో రాణించారు.

Whats_app_banner