Kohli vs Naveen: కోహ్లితో నేను మాట్లాడను.. కెప్టెన్ రాహుల్ పిలిచినా పట్టించుకోని నవీన్
Kohli vs Naveen: కోహ్లితో నేను మాట్లాడను అంటూ కెప్టెన్ రాహుల్ పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీనుల్ హక్. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా విరాట్, నవీన్ మధ్య గొడవ బాగా ముదిరిన విషయం తెలిసిందే.
Kohli vs Naveen: ఐపీఎల్ ప్రారంభమైన ఏడాది నుంచీ ప్రతి సీజన్ లో ఏదో ఒక గొడవ కచ్చితంగా ఉంటూనే ఉంది. ఈ సీజన్ లో అలాంటిదే ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో జరిగింది. ఈ మ్యాచ్ చివర్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, లక్నో పేస్ బౌలర్ నవీనుల్ హక్ మధ్య మొదలైన గొడవ.. తర్వాత కోహ్లి, గంభీర్ గొడవగా మారిపోయింది.
ప్లేయర్సంతా జోక్యం చేసుకున్నా.. వీళ్ల గొడవ అంత త్వరగా సద్దుమణగలేదు. చివరికి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ను కూడా నవీనుల్ హక్ లైట్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన తాజా వీడియో వైరల్ అవుతోంది. మ్యాచ్ తర్వాత అసలు గొడవకు కారణమేంటో రాహుల్ కు విరాట్ వివరించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న నవీన్ ను వచ్చి కోహ్లితో మాట్లాడాల్సిందిగా రాహుల్ కోరినా అతడు పట్టించుకోలేదు.
నేను అతనితో మాట్లాడను అన్నట్లుగా చెబుతూ నవీన్ దూరంగా వెళ్లిపోయాడు. ఆ సమయంలోనూ విరాట్ అతన్ని ఏదో అన్నాడు. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించిన తర్వాత లక్నో మెంటార్ గంభీర్ అక్కడి ప్రేక్షకులను నోర్మూసుకోండి అన్నట్లుగా సైగ చేయడాన్ని కోహ్లి మనసులో పెట్టుకున్నట్లు కనిపించింది. లక్నోలో ఆ టీమ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో విరాట్ చాలా దూకుడుగా కనిపించాడు.
ఇక లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆ టీమ్ పేస్ బౌలర్ నవీనుల్ హక్ తో కోహ్లికి ఏదో గొడవ జరిగింది. ఆ సయమంలో క్రీజులో ఉన్న లక్నో ప్లేయర్ అమిత్ మిశ్రాతోపాటు అంపైర్లు కూడా జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. అంపైర్లతో ఇదే విషయాన్ని విరాట్ చాలా సీరియస్ గా చర్చించాడు. ఆ తర్వాత కూడా నవీన్ ను చూస్తూ తన షూస్ ను కోహ్లి చూపించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ ఇద్దరు ప్లేయర్స్ మాటామాటా అనుకోగా.. లక్నో మెంటార్ గంభీర్ కూడా ఇందులో జోక్యం చేసుకున్నాడు. నిజానికి ఈ ఇద్దరు ప్లేయర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తు భగ్గుమంటుంది.
ఒకప్పుడు ఐపీఎల్లోనే గంభీర్ ఆడుతున్న సమయంలోనూ విరాట్ తో అతనికి చాలా పెద్ద గొడవే జరిగింది. అప్పటి నుంచీ వీళ్లు ఎప్పుడు కలిసినా.. ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఈ తాజా గొడవతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. అయితే యువ ప్లేయర్ అయిన నవీనుల్ హక్ తన మొహంపైనే మాట్లాడను అన్నట్లుగా సైగ చేయడం విరాట్ ఇగోను మరింత దెబ్బ తీసింది.
సంబంధిత కథనం