IPL Orange And purple Cap Winners: ఐపీఎల్ 2023 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్స్ వీళ్లే
IPL Orange And purple Cap Winners: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అవార్డులను గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు దక్కించుకున్నారు. ఆ క్రికెటర్స్ ఎవరంటే....
IPL Orange And purple Cap Winners: దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని పంచిన ఐపీఎల్ సమరం ముగిసింది. సోమవారం జరిగిన ఫైనల్‌లో గుజరాత్‌పై ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించి టైటిల్ దక్కించుకొంది.
లీగ్ ఆరంభం నుంచి అద్భుత పోరాట పఠిమను కనబరిచిన గుజరాత్ టైటాన్స్ విజయం ముగింట బోల్తా పడింది. ఫైనల్‌లోనూ చెన్నైకి గట్టి పోటీ ఇచ్చిన గుజరాత్ క్రీడాభిమానుల మనసుల్ని గెలుచుకుంది. గత సీజన్‌లో విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నది. టైటిల్ చేజారినా ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అవార్డులు రెండు గుజరాత్‌కే దక్కాయి.
ఆరెంజ్ క్యాప్ విన్నర్...
ఐపీఎల్ 2023లో ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 890 రన్స్‌తో లీగ్‌లో టాప్‌స్కోరర్‌గా గిల్ నిలిచాడు. విరాట్ కోహ్లి తర్వాత ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 800లకుపైగా పరుగులు చేసిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా గిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సీజన్‌లో గిల్ మూడు సెంచరీలు సాధించడం గమనార్హం.
ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ జాబితాలో గిల్ తర్వాత డుప్లెసిస్ (730 రన్స్)తో రెండో స్థానంలో నిలవగా...డేవాన్ కాన్వే (672 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి (639 రన్స్), యశస్వి జైస్వాల్ (625 రన్స్) నాలుగు, ఐదో స్థానంలో నిలిచారు.
పర్పుల్ క్యాప్ విన్నర్ షమీ
ఐపీఎల్ 2023లో 28 వికెట్లు తీసిన గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ముగ్గురు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు నిలవడం గమనార్హం.
షమీ తర్వాత 27 వికెట్లతో రషీద్‌ఖాన్ సెకండ్ ప్లేస్‌లో నిలవగా...మోహిత్ శర్మ (26 వికెట్లు) మూడో ప్లేస్‌ను దక్కించుకున్నాడు. నాలుగో స్థానంలో పీయూష్ చావ్లా (22 వికెట్లు) , ఐదో స్థానంలో చాహల్ (21 వికెట్లు) నిలిచారు.
టాపిక్