IPL 2023 SRH Captain : సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు? రేసులో ముగ్గురు ప్లేయర్స్
IPL 2023 SRH: ఐపీఎల్ 2023 వేలంలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లను తీసుకుంది. అయితే కొత్త కెప్టెన్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ముగ్గురు ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. మయాంక్ అగర్వాల్ పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.
2016లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. దాని తర్వాత.. ఇక ఐపీఎల్(IPL) ట్రోఫీ ఆశగానే మిగిలిపోయింది. కిందటి సీజన్ లో కేన్ విలియమ్స్ ను కెప్టెన్ గా చేశారు. ఈ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అద్భుతామేమీ చేయలేపోయాడు. ఇక కొత్త వాళ్లతో ప్రయోగం చేయాలనుకుంది సన్ రైజర్స్. ఐపీఎల్ 2023(IPL 2023) వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుంది. ఇంకా కెప్టెన్సీ ఎవరికీ అనే విషయంపై క్లారిటీ రాలేదు. ముఖ్యంగా ముగ్గురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో మయాంక్ అగర్వాల్ పేరు ముందుంది.
IPL 2023 సీజన్ 16 కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి జరిగిన మినీ వేలం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా బలమైన జట్టుగా ఏర్పడింది. వేలానికి ముందు కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న SRH జట్టు 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 25 మంది సభ్యులతో జట్టును పూర్తి చేసింది. SRH ముందున్న అతిపెద్ద సవాలు కెప్టెన్ ఎంపిక.
ఎందుకంటే గత సీజన్ లో సన్ రైజర్స్(Sunrisers) జట్టుకు నాయకత్వం వహించిన కేన్ విలియమ్సన్(kane williamson) ఈసారి గుజరాత్ టైటాన్స్ కు చేరాడు. కాబట్టి ఈసారి SRH జట్టు కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మాత్రం జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. SRH జట్టు కెప్టెన్ రేసులో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు.
మయాంక్ అగర్వాల్: గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్‌ను ఈసారి SRH ఫ్రాంచైజీ 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. మయాంక్‌ను SRH కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తారని చర్చలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే గత సీజన్ లో పంజాబ్ జట్టును చక్కగా నడిపించాడు. ఇప్పుడు SRH అతడివైపై మోగ్గుచూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఐదాన్ మార్క్‌రామ్ : ఐపీఎల్ 2022లో SRH కోసం మంచి ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఐదాన్ మార్క్‌రామ్ కెప్టెన్‌గా కూడా ఉండాలని భావిస్తున్నారట. గతంలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుకు నాయకత్వం వహించిన ఐదాన్ మార్క్‌రామ్ కూడా SRH జట్టుకు మంచి ఎంపిక. అందుకే ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఈ విదేశీ ఆటగాడి పేరును కూడా ఆలోచిస్తుందట.
భువనేశ్వర్ కుమార్: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH Hyderabad) వైస్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన భువనేశ్వర్ కుమార్ కూడా నాయకత్వ రేసులో ఉన్నారనే మాట వినిపిస్తోంది. గతంలో SRH జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం కూడా అతనికి ఉంది. దీని ప్రకారం, ఈ ముగ్గురిలో ఎవరికి కెప్టెన్ టైటిల్ దక్కుతుందో చూడాలి.
ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్ల భారీ మొత్తాని కొనుగోలు చేసింది హైదరాబాద్(Hyderabad). అంతేకాకుండా మయాంక్ అగర్వాల్‌ను కూడా రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. మొదటి నుంచి ఈ ఇద్దరి కోసం తీవ్రంగా ప్రయత్నించిన సన్‌రైజర్స్ చివరకు సక్సెస్ అయింది. మయాంక్ ను అంతపెట్టి తీసుకుంది కెప్టెన్సీ కోసమే అని కూడా అంటున్నారు.
సన్‌రైజర్స్ తుది జట్టు(అంచనా)
మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, ఐదాన్ మార్క్‌రామ్, హెన్రీచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.