IPL Orange and Purple Cap List : లక్నో ఎలిమినేషన్ తర్వాత ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లిస్ట్ ఎలా ఉంది?
IPL 2023 : మార్చి నెలాఖరున ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగింపు దశకు వచ్చేసింది. రెండో క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లిస్ట్ ఎలా ఉంది?
మే 24న లక్నో సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్(LSG Vs MI) మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ప్రత్యర్థి లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Super Giants)కు 183 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో సూపర్‌జెయింట్స్ విఫలమై 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగుల భారీ విజయంతో రెండో క్వాలిఫయర్ ఆడే అవకాశం దక్కించుకుంది.
అంతకుముందు తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓడిన గుజరాత్ టైటాన్స్(CSK VS GT), రెండో క్వాలిఫయర్ ఆడేందుకు సిద్ధంగా ఉంది. మే 26న ఈ పోరు ఉండనుంది. ఈ విధంగా టోర్నమెంట్ మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత, ఆరెంజ్ క్యాప్(Orange Cap), పర్పుల్ క్యాప్(Purple Cap)లో ఏ ఆటగాళ్లు ఉన్నారనే సమాచారం ఈ కింది విధంగా ఉంది.
ఆరెంజ్ క్యాప్
1. 14 ఇన్నింగ్స్‌ల్లో 730 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అగ్రస్థానంలో ఉన్నాడు.
2. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ 15 ఇన్నింగ్స్‌ల్లో 722 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
3. 14 ఇన్నింగ్స్‌ల్లో 639 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
4. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యశస్వి జైస్వాల్ 14 ఇన్నింగ్స్‌ల్లో 625 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
5. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన దివాన్ కాన్వే 14 ఇన్నింగ్స్‌ల్లో 625 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
పర్పుల్ క్యాప్
1. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మహ్మద్ షమీ 15 ఇన్నింగ్స్‌లలో 26 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
2. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన రషీద్ ఖాన్ 15 ఇన్నింగ్స్‌ల్లో 25 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
3. ముంబై ఇండియన్స్‌కు చెందిన పీయూష్ చావ్లా 15 ఇన్నింగ్స్‌లలో 21 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
4. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ 14 ఇన్నింగ్స్‌ల్లో 21 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
5. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు తుషార్ దేశ్ పాండే 15 ఇన్నింగ్స్ ల్లో 21 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
టాపిక్