Loan inquiries: లోన్స్ కోసం ఎక్కువగా ఎంక్వైరీలు చేస్తున్నారా? జాగ్రత్త.. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది
Credit score: వ్యక్తిగత రుణాలు లేదా వేరే ఇతర రుణాల కోసం ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో ఎక్కువగా ఎంక్వైరీలు చేస్తే, మీ క్రెడిట్ స్కోర్ పై అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తద్వారా రుణాలు పొందడం కష్టం అవుతుంది. ప్రీ-అప్రూవ్డ్ రుణాలతో ఆ సమస్య ఉండదు.
Credit score: క్రెడిట్ స్కోర్ అనేది క్రెడిట్ బ్యూరోలు మీకు ఇచ్చే మూడు అంకెల స్కోరు. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్ ను, మీ క్రెడిట్ అర్హతను బ్యాంక్ లు లేదా ఇతర ఫైనాన్స్ సంస్థలకు తెలియజేస్తుంది. అయితే, వేర్వేరు బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థల వద్ద రుణాల కోసం మీరు పలు ఎంక్వైరీలు చేస్తే, అది మీ క్రెడిట్ స్కోర్ (Credit score) పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా రుణం పొందడం కష్టమవుతుంది.
ఎంక్వైరీల రకాలు: హార్డ్ వర్సెస్ సాఫ్ట్
మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణదాత మీ అర్హతను నిర్ణయించడానికి మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తాడు. ఎంక్వైరీలు అని పిలువబడే ఈ క్రెడిట్ చెక్ లను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
హార్డ్ ఎంక్వైరీలు: లోన్ అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో మీ రుణదాత మీ క్రెడిట్ రిపోర్ట్ ను చెక్ చేసిన ప్రతిసారీ, దానిని హార్డ్ ఎంక్వైరీగా పరిగణిస్తారు. ప్రతీ హార్డ్ ఎంక్వైరీ మీ క్రెడిట్ స్కోరుకు తాత్కాలిక పెనాల్టీని తెస్తుంది.
సాఫ్ట్ ఎంక్వైరీలు: మీరు మీ క్రెడిట్ స్కోర్ ను సొంతంగా తనిఖీ చేసినప్పుడు లేదా ప్రీ అప్రూవ్డ్ లోన్ కోసం మీరు ప్రయత్నించినప్పుడు సాఫ్ట్ ఎంక్వైరీ గా పరిగణిస్తారు. సాఫ్ట్ ఎంక్వైరీలు మీ క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం చూపవు.
మీ క్రెడిట్ స్కోర్ పై బహుళ రుణ విచారణలు ఎలా ప్రభావం చూపుతాయి
రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు జరిగే హార్డ్ ఎంక్వైరీ కారణంగా మీ క్రెడిట్ స్కోరు కొద్దిగా తగ్గుతుంది. అంటే, రుణం కోసం చేసే ప్రతీ ఎంక్వైరీ హార్డ్ ఎంక్వైరీగా మీ క్రెడిట్ స్కోర్ ను తాత్కాలికంగా తగ్గిస్తుంది. కొన్ని ఎంక్వైరీలు ప్రభావం చూపనప్పటికీ, తక్కువ సమయంలో ఎక్కువ ఎంక్వైరీలు చేస్తే మాత్రం అది మీ క్రెడిట్ స్కోర్ ను తాత్కాలికంగా తగ్గిస్తుంది. అలాగే, మీరు ఎక్కువ సార్లు రుణం కోసం ప్రయత్నిస్తే, మీకు రుణం అవసరమని రుణదాతలకు అనిపిస్తుంది. ఇది మీ ప్రస్తుత రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు లేదన్న సంకేతాన్ని వారికి ఇస్తుంది. దాంతో, వారు మీకు రుణం ఇవ్వడం ప్రమాదంగా భావిస్తారు. తత్ఫలితంగా, మీరు కోరుకున్న మొత్తంలో రుణం పొందలేకపోవచ్చు లేదా వడ్డీ రేటు పెరగవచ్చు. లేదా మీ దరఖాస్తును తిరస్కరించవచ్చు.
మీరు క్రెడిట్ ఎంక్వైరీల ప్రభావాన్ని ఎలా తగ్గించవచ్చు?
- ఒకేసారి అనేక చోట్ల రుణాలకు దరఖాస్తు చేయవద్దు. రోజుల వ్యవధిలో అనేక చోట్ల లోన్ ఎంక్వైరీలు చేస్తే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది.
- చాలా రుణదాతలు క్రెడిట్ స్కోర్ ఆధారంగా ప్రీ-అప్రూవ్డ్ రుణాలను అందిస్తాయి. అవి ప్రయత్నించండి.
- 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది మీ రుణదాతల నుండి రుణాలపై ఉత్తమ ఆఫర్లను పొందడంలో మీకు సహాయపడుతుంది.
- లోన్ అగ్రిగేటర్లు మీ క్రెడిట్ స్కోర్ (Credit score) ఆధారంగా మీకు అర్హత ఉన్న అందుబాటులో ఉన్న ఆఫర్లను అందిస్తాయి.