LSG Vs KKR : కోల్‌కతాపై విజయం.. ప్లేఆప్స్‌కు లక్నో సూపర్‌జెయింట్స్-ipl 2023 kkr vs lsg lucknow super giants win against kolkata knight riders by 1 run ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lsg Vs Kkr : కోల్‌కతాపై విజయం.. ప్లేఆప్స్‌కు లక్నో సూపర్‌జెయింట్స్

LSG Vs KKR : కోల్‌కతాపై విజయం.. ప్లేఆప్స్‌కు లక్నో సూపర్‌జెయింట్స్

HT Telugu Desk HT Telugu
May 21, 2023 05:42 AM IST

LSG Vs KKR : లక్నో సూపర్‌జెయింట్స్ ప్లేఆప్స్‌కు దూసుకెళ్లింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది.

కోల్‌కతాపై Vs లక్నో
కోల్‌కతాపై Vs లక్నో (LSG Twitter)

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కేవలం ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్ ఐపీఎల్ ప్రస్తుత ఎడిషన్ ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. మరోవైపు కేకేఆర్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌కి ప్లే-ఆఫ్‌లోకి ప్రవేశించేందుకు భారీ విజయం తప్పనిసరి. మరోవైపు లక్నో జట్టుకు ఒక్క విజయం చాలు. ఎట్టకేలకు లక్నో గెలిచింది. భారీ తేడాతో గెలుపొందాలని కలలుగన్న నితీశ్ రాణా జట్టు కనీసం గెలవలేకపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. KKR 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించిన రింకూ సింగ్ పోరాటం వృథా అయింది. ఈ విజయంతో లక్నో జట్టు ప్రస్తుత ఎడిషన్‌లో మూడో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్, చెన్నై అదే స్థానంలో కొనసాగనున్నాయి. అలాగే క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.

లక్నో సూపర్‌జెయింట్స్‌ ఒక్క పరుగు తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. మెుదలు బ్యాటింగ్​ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (28: 27), ప్రేరక్ మన్కడ్ (26: 20 బంతుల్లో), ఆయుష్‌ బదోని (25: 21 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. చివర్లో నికోలస్ పూరన్ (58:30, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్​ సెంచరీతో మెరిశాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, వైభవ్‌ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.

177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది కేకేఆర్​. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 121 పరుగులకు వచ్చింది. జాసన్​ రాయ్​(45), వెంకటేశ్ అయ్యర్​(24), నితీశ్ రానా(8), రెహ్మానుల్లా గుర్బాజ్​(10), ఆండ్రూ రసెల్​(7) పరుగులు చేశారు. కోల్‌కతా లక్ష్యానికి అంత దగ్గరికి రావడానికి కారణం రింకూ సింగ్ (67 నాటౌట్: 33 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు). ఇన్నింగ్స్ స్లో అవ్వకుండా ఆడుతూ వచ్చాడు. కోల్‌కతా విజయానికి చివరలో 18 పరుగులు అవసరం ఉంది. రింకూ 16 పరుగులు చేశాడు. ఈ కారణంగా కోల్‌కతా కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్​ రెండు వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్​, యశ్​ థాకూర్​ తలో వికెట్ తీసుకున్నారు.

Whats_app_banner

టాపిక్