India vs Afghansitan Asia Cup 2022: బెంబేలెత్తించిన భువి.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ఆఫ్గాన్ బ్యాటర్లు .. భారత్ ఘనవిజయం
India won Against Afghanistan: ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మిగిలిన వారు పెవిలియన్ చేరారు.
India vs Afghansitan Asia Cup 2022: ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ శతకంతో అదరగొట్టిన వేళ.. భారత్ పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత్.. విజయంతో ఆసియా కప్‌ను ముగించి పరువు దక్కించుకుంది. 213 పరుగుల లక్ష్య ఛేదనంలో ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్(64)అర్ధ శతకం మినహా మిగిలిన వారెవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్ల పతనాన్ని శాసించాడు. అర్షదీప్ సింగ్, అశ్విన్, దీపక్ హుడా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
బ్యాటర్లను బెంబేలెత్తించిన భువి..
213 పరుగుల లక్ష్య ఛేదనంలో బరిలోకి దిగిన ఆఫ్గాన్ ఇన్నింగ్స్ ఆద్యంతం అత్యంత పేలవంగా సాగింది. స్కోరు ప్రారంభం కాకముందే.. ఓపెనర్ హజ్రతుల్లా జజాల్‌ను(0) భువి ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ చేశాడు చేశాడు. అనంతరం అదే ఓవర్ చివరి బంతికి మరోమరో ఓపెనర్ రహమతుల్లాను(0) క్లీన్ బౌల్డ్ చేసి ఆఫ్గాన్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అప్పటికి ఆ జట్టు స్కోరు ఒక పరుగు మాత్రమే. తర్వాతి ఓవర్‌లో వికెట్లేమి పడలేదు. మూడో ఓవర్లో మళ్లీ బంతిని అందిపుచ్చుకున్న భువి అదే ఓవర్లో కరీమ్ జనత్(2), నజీబుల్లా(0) వికెట్లను తీశాడు. ఆ కాసేపటికే కెప్టెన్ నబీని(7) అర్షదీప్ సింగ్ ఎల్బీడబ్ల్యూ చేసి ప్రత్యర్థిని పీకల్లోతూ కష్టాల్లో నెట్టాడు. ఈ విధంగా పవర్ ప్లే పూర్తయ్యే సరికి సగం వికెట్లను కోల్పోయింది ఆఫ్గాన్. అనంతరం ఏడో ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన భువి.. అజ్మతుల్లాను(1) ఔట్ చేసి 5 వికెట్లతో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.
అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ ఆఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అలాగే పాతుకుపోయాడు. నిలకడగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. చివరి వరకు ఆడి అద్భుత అర్ధశతకాన్ని నమోదు చేశాడు. చివర్లో సిక్సర్లతో మెరుపులు మెరిపించిన ఇబ్రహీం 59 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. టెయిలెండర్లైన రషీద్ ఖాన్(15), ముజీబుర్ రెహమాన్‌ను(18) అడ్డం పెట్టుకుని జట్టుకు ఆ మాత్రం స్కోరయినా అందించగలిగాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఈ పరుగులు విరాట్ కోహ్లీ చేసిన 122 కంటే కూడా తక్కువ కావడం గమనార్హం.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టాపోయి 212 పరుగులు భారీ స్కోరును సాధించింది. విరాట్ కోహ్లీ(122*) శతకంతో ఓ రేంజ్‌లో విజృంభించగా.. కేఎల్ రాహుల్(62) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్లుగా దిగిన వీరిద్దరూ ఆఫ్గాన్ బౌలర్లను ఓ రేంజ్‌ల ఆడుకున్నారు. ఫలితంగా భారీ స్కోరు సాధించింది భారత్. ఆఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మాలిక్ 2 వికెట్లు తీశాడు.
53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. వెయ్యి రోజుల తర్వాత అంతర్జాతీయ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. విరాట్ సెంచరీ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. టీ20ల్లో విరాట్‌కు ఇది తొలి శతకం కావడం గమనార్హం.
సంబంధిత కథనం