Rohit Sharma : మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్.. సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్
IND Vs NZ ODI : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ఇండియా సిద్ధమైంది. ఇషాన్ కిషన్ కు అవకాశం కల్పిస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అయితే మిడిలార్డర్ లో వస్తాడని తెలిపాడు.
ఇషాన్ కిషన్(Ishan Kishan)కు అవకాశం కల్పించనున్నట్టుగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చెప్పాడు. అయితే ఓపెనర్ గా కాదని.. మిడిలార్డర్ లో బరిలోకి దింపనున్నట్టుగా స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ మీద డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో అవకాశాన్ని కోల్పోయాడు. కేఎల్ రాహుల్(KL Rahul) కోసం ఇషాన్ ను పక్కనపెట్టారు. ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు రాహుల్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇషాన్ ను మిడిలార్డర్ లో ఆడించనున్నారు.
ఉప్పల్ వేదికగా.. తొలి వన్డే జరగనుంది. ఇందులో ఇషాన్ కిషన్ ఆడనున్నాడని రోహిత్ శర్మ(Rohit Sharma) చెప్పాడు. మరోవైపు హోమ్ గ్రౌండ్ లో మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) తొలి మ్యాచ్ ఆడనున్నాడు. అతడు రాణించాలని కోరుకుంటున్నట్టుగా రోహిత్ శర్మ చెప్పాడు. న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో వన్డే సిరీస్ ఆడుతున్నామని, మా శక్తి సామర్థ్యాలను మించి అవకాశమని రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంక సిరీస్ తో తుదిజట్టులో చోటు దక్కని.. ఇషాన్ కు ఈసారి మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం కల్పిస్తామని.. వరల్డ్ కప్(World Cup) వరకూ బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యమని రోహిత్ అన్నాడు.
'సిరాజ్ కు ఉప్పల్ స్డేడియం హోం గ్రౌండ్. మెుదటిసారి హోమ్ గ్రౌండ్ లో వన్డే మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ కు ఆల్ ది బెస్ట్. రెండేళ్లుగా సూపర్ ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. అతడి గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది. వికెట్లు తీస్తూ.. టీమిండియాకు బూస్టప్ ఇస్తున్నాడు. ప్రస్తుతం సిరాజ్ మూడు ఫార్మాట్లలో కీలకమైన ఆటగాడు. వరల్డ్ కప్ దగ్గరపడుతోంది. అతడిపై వర్క్ లోడ్ కాస్త ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. బుమ్రా లేకపోవడంతో సిరాజ్ కీలకమైన బౌలర్ గా మారాడు. వచ్చే వరల్డ్ కప్ లో కీలకమవుతాడు.' అని రోహిత్ అన్నాడు.
ప్రత్యర్థి జట్టు ఎలా ఉందో అని ఆలోచించమని రోహిత్ శర్మ అన్నాడు. శక్తి సామర్థ్యాలపై ఎక్కువగా దృష్టి పెడతామని చెప్పాడు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, షెహబాష్, కుల్దీప్ యాదవ్ అందుబాటులో ఉన్నారని తెలిపాడు. మ్యాచ్ సమయానికి ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు లేదా ఒక స్పిన్నర్, నలుగురు పేసర్లు కాంబినేషన్‌పై ఆలోచిస్తామన్నాడు రోహిత్.
సంబంధిత కథనం