IPL 2023 : ముంబయి ఇండియన్స్ ద్వారా ముఖేష్, నీతా అంబానీ ఎంత సంపాదిస్తారు?
IPL 2023 : ఫైనల్స్‌కు చేరుకోవడంలో ముంబై ఇండియన్స్ విఫలమైంది. అయినా నీతా అంబానీ, ముఖేష్ అంబానీలు IPL ద్వారా వందల కోట్లు సంపాదించారు.
దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), అతడి భార్య నీతా అంబానీ(Nita Ambhtani) ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్లు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2023(IPL 2023)లో గుజరాత్ టైటాన్స్‌పై ఓడిపోయింది. దీంతో ఫైనల్‌లోకి ప్రవేశించి ట్రోఫీని గెలుచుకునే అవకాశం కోల్పోయింది.
IPL 2023 ఫైనల్స్‌కు చేరుకోవడంలో ముంబై ఇండియన్స్ విఫలమైనప్పటికీ, నీతా అంబానీ మరియు ముఖేష్ అంబానీ IPL 2023 ద్వారా వందల కోట్లు సంపాదించారు. నీతా అంబానీ యాజమాన్యంలోని IPL జట్టు ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్‌తో ఓడిపోయింది. దీంతో ఫైనల్‌లోకి ప్రవేశించి ట్రోఫీని గెలుచుకునే చివరి అవకాశాన్ని కోల్పోయింది. ఇదిలావుండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారవ సీజన్ ద్వారా అంబానీ వందల కోట్లు సంపాదించారు.
నీతా అంబానీ, ముఖేష్ అంబానీ IPL జట్టు ముంబై ఇండియన్స్‌లో 100 శాతం వాటా కలిగి ఉన్నారు. 2008లో జట్టును కొనుగోలు చేయడానికి మిలియన్ డాలర్లు వెచ్చించారు. GQ నివేదికల ప్రకారం, మొదటి సీజన్‌లో జట్టును పొందడానికి ముఖేష్ అంబానీ రూ.916 కోట్లు చెల్లించారు.
ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన IPL జట్టుగా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఈ జట్టు ఇప్పటివరకు ఐదు సీజన్‌లను గెలుచుకుంది. 2023 వరకు అత్యధిక IPL మ్యాచ్‌లను గెలుచుకుంది. దీంతో అధిక బ్రాండ్‌ను కొనసాగిస్తూ పెద్ద సంఖ్యలో స్పాన్సర్‌లను సంపాదించిన జట్టుగా ముంబయి ఉంది.
అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు అత్యంత లాభదాయకమైన IPL జట్టు. ది ట్రిబ్యూన్ ప్రకారం, ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ రూ. 10,070 కోట్లకు పైగా ఉంది. గత ఏడాది కంటే దాదాపు రూ. 200 కోట్లు పెరిగింది. ఇది కాకుండా, నీతా, ముఖేష్ అంబానీ టిక్కెట్ ధరలు, ఇతర విషయాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అలాగే మీడియా స్పాన్సర్‌షిప్‌లు, ఇతర ప్రకటనల ద్వారా కోట్లలో డబ్బులు వస్తాయి. అంతేకాదు.. అంబానీ కుటుంబానికి మరో ప్రధాన ఆదాయ వనరు జియో సినిమాస్‌కే ఈసారి ఐపీఎల్ హక్కులు వెళ్లాయి.
IPL ఫ్రాంచైజీని డిస్నీ+ హాట్‌స్టార్ మరియు రిలయన్స్ బ్రాండ్ వయాకామ్ 18 జియో సినిమాల కోసం IPL టెలికాస్టింగ్ హక్కులను రూ. 22,290 కోట్లకు కొనుగోలు చేసింది. అయినప్పటికీ, Jio సినిమాస్ IPL నుండి 23,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో వేల కోట్లను ఆర్జించనుంది. ఇలా ముంబయి ఇండియన్స్ జట్టు ద్వారా, మరోవైపు జియో సినిమాస్ ద్వారా అంబానీ బాగా సంపాదిస్తున్నాడు.