IPL Final Weather Updates: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - సోమవారం రోజు వర్షం పడే ఛాన్స్ తక్కువేనటా!
IPL Final Weather Updates: భారీ వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ సోమవారానికి వాయిదా పడటంతో క్రికెట్ అభిమానులు డిజపాయింట్ అయ్యారు. కాగా రిజర్వ్ డే రోజున అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతోన్నారు.
IPL Final Weather Updates: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు కూడా వర్షం ముప్పు పొంచి ఉండటంతో రిజర్వ్ డే రోజైనా ఫైనల్ జరుగుతుందా? లేదా? అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
సోమవారం ఉదయం అహ్మదాబాద్‌లో మేఘాలు పూర్తిగా తొలగిపోయి సూర్యుడు కనిపించడంతో క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆనందం వ్యక్తమవుతోంది. సోమవారం నాడు వర్షం కురిసే అవకాశం దాదాపు నలభైశాతం మాత్రమే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతోన్నారు.
మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటోన్నారు. ఒకవేళ వర్షం పడినా ఆదివారం నాటి మాదిరిగా భారీగా కురవకపోవచ్చునని సమాచారం. ఆదివారం మ్యాచ్ క్యాన్సిల్ కావడంతో ఫిజికల్ టికెట్స్ ఉన్న వారందరిని సోమవారం కూడా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి అనుమతించబోతున్నట్లు స్టేడియం వర్గాలు ప్రకటించాయి.
కాగా ఐపీఎల్ ముగింపు వేడుకల్ని భారీగా ప్లాన్ చేశారు. కానీ వర్షం కారణంగా అవన్నీ రద్దయ్యాయి. సోమవారం స్పెషల్ ఈవెంట్స్ ఏవీ లేకుండా డైరెక్ట్‌గా మ్యాచ్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. కాగా పదహారేళ్ల ఐపీఎల్ చరిత్రలో వర్షం కారణంగా ఫైనల్ వాయిదాపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఒకవేళ సోమవారం కూడా వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే పాయింట్స్ టేబుల్, రన్‌రేట్ ప్రకారం గుజరాత్ టైటాన్స్ విజేతగా ప్రకటించబోతున్నట్లు చెబుతోన్నారు. ఇదే జరిగితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరుసగా రెండో ఏడాది కూడా కప్ నిలబెట్టుకోన్న జట్టుగా గుజరాత్ టైటాన్స్ చరిత్రను సృష్టించనున్నది.