Happy Birthday Hardik Pandya: హ్యాపీ బర్త్‌డే హార్దిక్‌.. పెర్త్‌లో టీమ్‌మేట్స్‌తో సెలబ్రేషన్స్‌-happy birthday hardik pandya says team india as they celebrated by cutting the cake in perth ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Happy Birthday Hardik Pandya: హ్యాపీ బర్త్‌డే హార్దిక్‌.. పెర్త్‌లో టీమ్‌మేట్స్‌తో సెలబ్రేషన్స్‌

Happy Birthday Hardik Pandya: హ్యాపీ బర్త్‌డే హార్దిక్‌.. పెర్త్‌లో టీమ్‌మేట్స్‌తో సెలబ్రేషన్స్‌

Hari Prasad S HT Telugu
Oct 11, 2022 04:03 PM IST

Happy Birthday Hardik Pandya: హ్యాపీ బర్త్‌డే హార్దిక్‌ పాండ్యా అంటూ పెర్త్‌లో టీమ్‌మేట్స్‌ ఈ ఆల్‌రౌండ్‌ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్‌ చేశారు. మంగళవారం (అక్టోబర్‌ 11) హార్దిక్‌ తన 29వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

హార్దిక్ పాండ్యా బర్త్ డే సెలబ్రేషన్స్
హార్దిక్ పాండ్యా బర్త్ డే సెలబ్రేషన్స్ (BCCI twitter)

Happy Birthday Hardik Pandya: ఇండియన్‌ టీమ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మంగళవారం (అక్టోబర్‌ 11) తన 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్స్‌ కేక్‌ కట్‌ చేసి అతని బర్త్‌డేను ఘనంగా జరిపారు. మంగళవారం ఉదయమే ప్లేయర్స్‌ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. బ్లూ జాకెట్, బ్లూ జీన్స్‌లో బర్త్‌డే బాయ్‌ హార్దిక్‌ పాండ్యా కేక్‌ కట్‌ చేశాడు. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రాహుల్‌, రిషబ్‌ పంత్‌, అశ్విన్‌లాంటి వాళ్లంతా హార్దిక్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. అయితే హార్దిక్‌ తన ఫ్యామిలీని మిస్‌ అవుతున్నాడు. ప్లేయర్స్‌ ఫ్యామిలీస్‌ను వెంట తీసుకెళ్లలేదు. దీంతో తన బర్త్‌డేనాడు తన కొడుకును మిస్‌ అవుతున్నట్లు ఇన్‌స్టాలో ఈ ఫొటోలు పోస్ట్ చేశాడు.

గతేడాది గాయం కారణంగా టీమ్‌కు దూరమై.. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటన్స్‌ కెప్టెన్‌గా తిరిగి ఫీల్డ్‌లో అడుగుపెట్టాడు హార్దిక్‌ పాండ్యా. అప్పటి నుంచీ తన లైఫ్‌టైమ్‌ ఫామ్‌లో ఉన్నాడతడు. గుజరాత్‌ను ఐపీఎల్‌ విజేతగా నిలిపాడు. ఆ తర్వాత ఇండియన్‌ టీమ్‌లో అసలుసిసలు ఆల్‌రౌండర్‌ పాత్ర పోషిస్తూ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. 19 మ్యాచ్‌లలో 436 రన్స్‌ చేశాడు. 150కిపైగా స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధిస్తుండటం విశేషం.

దీంతో ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్‌ కీలకం కానున్నాడు. మరోవైపు అక్టోబర్‌ 23న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనున్న ఇండియన్‌ టీమ్‌ అంతకుముందు రెండు వామప్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి ఎంతో ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లిన టీమ్.. పెర్త్‌లో ప్రాక్టీస్‌ చేస్తోంది. ఇప్పటికే వెస్టర్న్‌ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడి గెలిచింది.

ఈ మ్యాచ్‌లోనూ హార్దిక్‌ 20 బాల్స్‌లో 27 రన్స్‌ చేశాడు. దీంతో ఇండియా 158 రన్స్‌ చేయగా.. తర్వాత వెస్టర్న్‌ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 రన్స్‌ మాత్రమే చేసింది. అక్టోబర్‌ 13న మరో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనున్న టీమ్‌.. అక్టోబర్‌ 17, 19 తేదీల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో వామప్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

WhatsApp channel