నదులు కనిపించగానే నాణేలు విసురుతారు ఎందుకు? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది?-why do we prayer to rivers and toss coins into them ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నదులు కనిపించగానే నాణేలు విసురుతారు ఎందుకు? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది?

నదులు కనిపించగానే నాణేలు విసురుతారు ఎందుకు? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది?

Gunti Soundarya HT Telugu
Sep 28, 2024 02:34 PM IST

భారతీయులు నదులను దేవతలుగా భావిస్తారు. నిత్యం నదులకు పూజలు నిర్వహిస్తూ హారతి ఇస్తారు. ఇలా పూజించడం వెనుక కారణం ఏంటి? అలాగే నదులలో నాణేలు ఎందుకు విసిరేస్తారు? ఇలా చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటి?

నదులకు పూజలు ఎందుకు చేస్తారు?
నదులకు పూజలు ఎందుకు చేస్తారు? (Rameshwar Gaur)

పురాతన కాలం నుంచి నదులు ప్రజలకు జీవనాధారంగా ఉన్నాయి. పంటలు సమృద్ధిగా పండటం కోసం నీటిని ఇవ్వడమే కాకుండా మానవ జీవితాన్ని కూడా పోషిస్తాయి. అందుకే వీటిని జీవనాధార శక్తిగా గౌరవిస్తారు. 

భారతీయులు మాత్రం నదులను దేవతలుగా, దేవతల స్వరూపాలుగా పూజిస్తారు. అనేక సంస్కృతులలో నదులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. గంగా, యమునా వంటి నదులు పుణ్యక్షేత్రాలుగా విరాజుల్లుతున్నాయి. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదులలో గంగా నది ఒకటి. గంగా దేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఆమెను మా గంగా అని గౌరవంగా పిలుస్తారు. 

అన్ని జీవులను పోషించే తల్లిగా భావిస్తారు. శివుని తల మీద నుంచి భూమి మీదకు నేరుగా ప్రవహిస్తుందని నమ్ముతారు. అలాగే పూర్వీకుల బూడిదని శుద్ధి చేసి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. భూమిపైకి రావాలని భగీరథరాజు గంగను కోరినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. 

నదులను దేవతలుగా ప్రార్థిస్తూ పూజిస్తారు. అయితే పవిత్రమైన నదులు కనిపించినప్పుడు పుణ్య స్నానాలు ఆచరించడంతో పాటు కొంతమంది చేసే మరొక పని నదిలోకి నాణేలను విసిరేయడం. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఇది మూఢనమ్మకంగా కొందరు కొట్టి పారేస్తే మరి కొందరు మాత్రం దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు.

ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు

నదిలో నాణేలు వదిలే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తుంది. అప్పుడు అందరి దగ్గర రాగి నాణేలు ఉండేవి. రాగికి శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. అందువల్ల వాటిని నదిలోకి విసిరినప్పుడు నీరు శుద్ధి అవుతుందని, వాటిని తాగేందుకు, స్నానం చేసేందుకు ఇతర రోజువారీ కార్యకలాపాలతో ఉపయోగించినప్పుడు ఎటువంటి హాని కలిగించదని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల అంటు వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు. 

అందుకే రాగి నాణేలు నదిలో వేయడానికి ఇదొక ముఖ్యమైన కారణం చెబుతారు. రాగి నాణేలను నదిలోకి విసిరినప్పుడు అందులోనే యాంటీ మైక్రో బయల్ లక్షణాలు నీటిలోని మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ఆ నీరు తాగేందుకు సరిపోయే విధంగా మారుతాయి. అది మాత్రమే కాకుండా మీరు ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. రాగి నాణేలు వేయడం వల్ల నీరు శుద్ధికరణ జరుగుతుందని నమ్మేవాళ్ళు.  రాగి నాణేలు నదులను శుద్ధి చేయడానికి ఒక శాస్త్రీయ కారణంగా చెబుతారు. అయితే మరొక వాదన ప్రకారం నాణేలు నదిలోకి వేయడం అంటే సంపద, శ్రేయస్సుకు దేవతగా భావించే లక్ష్మీదేవికి నైవేద్యంగా ఇస్తున్నట్టు నమ్ముతారు. నదికి వీటిని సమర్పించడం ద్వారా తమకు శ్రేయస్సు అదృష్టం అనుగ్రహించేందుకు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు నమ్ముతారు.

అలా నదిలో నాణేలు వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అదృష్టం పొందుతారని అనుకుంటూ వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాడుకలో రాగినాణేలు లేవు. ప్రస్తుతం ఉన్న నాణేలు వీటిలో వేయడం వల్ల అది నీటిని కలుషితం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది నీటిలో ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల తుప్పు పట్టడం జరుగుతుంది. దానివల్ల నీరు కలుషితమై అవి తాగేందుకు పనికిరాకుండా పోతున్నాయి. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి

 

టాపిక్