Vidura neeti: మహాభారతంలో విదురుడు ఎవరు? జీవితాన్ని సన్మార్గంలో నడిపించేందుకు విదుర నీతి ఏం చెబుతోంది?
Vidura neeti: మహా భారతంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి విదురుడు. ఆయన చెప్పిన నీతులు పాటించడం వల్ల జీవితం అత్యున్నత స్థాయిలో ఉంటుందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Vidura neeti: మహాభారతంలో ఒక్కొక్క పాత్రకి ఒక ప్రత్యేక స్థానముంది. ధర్మమార్గంలో నడిచినటువంటి వారిలో భీష్ముడు, ధర్మరాజు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత విదురుడికి ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మతెలిపారు.
విదురుడు గొప్ప ఆధ్యాత్మిక సాధకుడని, సత్త్వ జ్ఞాన సంపన్నుడని అందుకనే శ్రీకృష్ణుడు సైతం దూతగా వచ్చి విదురుని వద్దనే నివాసం ఉన్నాడని మహాభారతం చెపుతుందని చిలకమర్తి తెలిపారు. విదుర నీతులు అర్థం చేసుకున్న వారికి, వాటి ప్రకారం నడిచే వారికి ఎటువంటి పాపాలు అంటవని చిలకమర్తి తెలిపారు. పరాశరమహర్షి వల్ల మత్స్యకన్య అయిన మత్స్యగ్రంధికి తర్వాత కాలంలో మత్స్యగ్రంధి వ్యాసభగవానుడు జన్మించాడు. ఆ తర్వాత శంతన మహారాజును వివాహమాడి ఇద్దరు పుత్రులకు జన్మనిచ్చింది.
మొదటివాడు మరణించగా రెండవవానికి భీష్ముడు అంబిక, అంబాలికలతో వివాహం జరిపించాడు. పుత్రులు కలుగకుండానే ఆ రెండవవాడు మరణించాడు. వ్యాసుని వల్ల అంబ, అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. ఒక దాసి స్త్రీకి వ్యాసుని వలన జన్మించినవాడే విదురుడు. వ్యాసుని బీజం కనుక వ్యాసుని తర్వాత అంతటవాడుగా అందరూ గౌరవించారు. ధర్మశాస్త్ర కోవిదుడైన విదురుడు చెప్పిన నీతులు కేవలం ఆనాటి పరిస్థితులకు మాత్రమే పరిమితమైనవిగా భావిస్తే అది అపోహ మాత్రమే. సంజయుడి రాయబారం ముగిసింది.
కౌరవ సోదరులకు, శకునికి భయం కలిగింది. ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం కల భీష్మాచార్యుడు జరగబోయే వినాశనాన్ని గ్రహించి మౌనం దాల్చాడు. ద్రోణుడు, కృపాచార్యుడు వంటి వీరులు ఇక జరగబోయే పరిణామాలను ఊహించసాగారు. ధృతరాష్ట్రుడు చింతలో మునిగిపోయాడు. నిద్ర, ఆహారంపైన వ్యామోహం చచ్చిపోయింది. మనశ్శాంతి కరువయ్యింది. మనసుకు కొంత ఊరట కావాలి. అందుకు హితవచనాలు వినాలి. వాటితో మనసుకు కాస్తంత స్వాంతన ఉంటుందని భావించాడు. అందుకు సమర్ధుడు సర్వ ధర్మశాస్త కోవిదుదైన విదురుడేనని అతడికి కబురు చేశాడు. విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడి ఆంతర్యం గ్రహించాడు. అనేక విషయాల గురించి అతడికి వివరించాడు. అనేక నీతులను, ధర్మాలను బోధించాడు. ధృతరాష్ట్రుడికి విదురుడు బోధించిన నీతులన్నీ ఆచరింపతగినవి కానీ, పుత్రప్రేమ వల్ల ధృతరాష్ట్రుడు మనస్సును కూడా అంధకారం వైకల్యంలో ఉంచుకున్నాడు.
కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కౌరవ వంశం నాశనమయ్యింది. భూదేవికి పాపభారం తగ్గింది. విదురనీతులు అనేవి ఈ లోకం మనగలిగినంత కాలం నిలిచి ఉంటాయని, వాటిని ఆచరించడం మంచిదని చిలకమర్తి తెలిపారు. కాలగమనంలో దురదృష్టం కొద్ది విదురనీతుల్లోకి ఎన్నో ప్రక్షిప్తాలు చోటుచేసుకున్నాయి. ఇతిమిద్దంగా ఇవి విదురుడు చెప్పిన నీతులే అని ఖచ్చితంగా చెప్పటం ఒక గొప్ప సాహసమే అవుతుంది. మంచి విషయాలు ఎవ్వరు చెప్పినా ఆచరింపతగినవే కనుక విదురనీతులుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి నీతులు ఈనాటి పరిస్థితులకు కూడా ఎంతో అవసరమైనవి, విలువైనవని చిలకమర్తి తెలిపారు.
విదుర నీతులు
ఆహ్వానం రాకుండా ఎక్కడికీ వెళ్ళరాదు.
పెద్దల పట్ల వినయ, విధేయతలతో ప్రవర్తించాలి.
ఆగ్రహం సర్వవిధాల నష్టం కల్గిస్తుంది.
అహంకారం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు నాశనమే. అంగబలం, అర్ధబలం కన్నా సంకల్ప బలమే గొప్పది.
నీతిమంతుల్ని ఇబ్బందులపాలు చేయడం లోకం హర్షించదు.
పరాయి స్త్రీని అవమానిస్తే పతనం తప్పదు.
వ్యసనపరుడు సర్వం కోల్పోతాడు.
స్త్రీ ఆగ్రహం ప్రళయాంతకం.
ఆత్మస్థైర్యం కలవాడు ఎన్ని ఆపదలొచ్చినా ఎదురు నిలుస్తాడు.
సత్యమార్గంలో నడిచే వ్యక్తికి ఓటమి ఉండదు.
సత్యం ద్వారా పొందే కీర్తి శాశ్వతమైనది.
పతనానికి ప్రథమ కారణం అసూయా ద్వేషాలు.
సమఉజ్జీతో యుద్ధం ప్రాణాంతకం.
మేలు కోరే బంధువును ఆదరించాలి.
వివేకవంతుడు అసందర్భ ప్రేలాపన చెయ్యడు.
శక్తిమంతుడు హేళనను భరించడు. సమయం, సందర్భం చూసి ప్రతీకారం తీర్చుకుంటాడు.
ఉపకారికి అపకారం తలపెట్టినవాడు నాశనం కాక తప్పదు.
బలహీనులను ఆదరించాలి. సమఉజ్జీవులను గౌరవించాలి, పెద్దవారిని సేవించాలి.
టాపిక్