Chanakya Niti Telugu : జీవితంలో ఈ విషయాలతో యుద్ధం చేయాలి.. అప్పుడే గెలుపు
Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. ఆయన చెప్పిన సూత్రాలు పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు.
చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలోని ముఖ్యమైన దశలను వివరించాడు. ఆయన ప్రకారం గొప్ప వ్యక్తి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. పని ప్రదేశంలో సవాళ్లు వస్తూనే ఉంటాయి. ఇదంతా విజయానికి సంబంధించిన అంచనా. చాణక్యుడి విధానాల్లోని సమస్యలన్నింటికీ పరిష్కారాలను సూచించాడు. శత్రువును ఓడించడానికి ఒంటరిగా నిలబడి పోరాడడం సాధ్యం కాదు. దాని కోసం సైన్యాన్ని సమీకరించాలి. అప్పుడు శత్రు దళాన్ని సులభంగా ఓడించవచ్చు. జీవితంలోని అన్ని పరీక్షలకూ మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి. మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో చాణక్యుడు కొన్ని సూత్రాలను వెల్లడించాడు. వాటి గురించి తెలుసుకుందాం..
ఏం కోల్పోయినా చెడుగా ఆలోచించొద్దు
జీవితంలో ఒక్కోసారి మీ సంపద, స్నేహితులు, భార్య, విలువైన వస్తువులను కోల్పోతారు. దాని గురించి బాధపడి ఏదేదో ఆలోచించకూడదు. ఒక్కసారి పోయిన జీవితం తిరిగి రాదు అంటాడు చాణక్యుడు. కొందరు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఆత్మహత్య మహాపాపం. మనల్ని ఈ భూమి మీదకు తెచ్చిన దేవుడికి మాత్రమే మనల్ని తిరిగి పిలిచే శక్తి ఉంది. అంతే కాకుండా మన జీవితాల గురించి చింతించకూడదు. జీవితంలో ఎలాగైనా బతకొచ్చు. బతకాలనే ఆశ మాత్రం ఉండాలి.
జీవితంలో యుద్ధం చేయాలి
యుద్ధమైనా, జీవితంలో ఎలాంటి పరీక్షలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ పనిలోనైనా ప్రిపరేషన్ లేకుండా హడావుడి చేయడం తప్పు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ముందుగా ప్రిపరేషన్‌తో ఎదుర్కోవాలని చాణక్యుడు చెప్పాడు. ప్రిపరేషన్ లేకపోతే మీ శ్రమ వృథా అవుతుంది. జీవితమనే పరీక్షలో గెలిచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
వాటికి దూరంగా ఉండాలి
చాణక్యుడు ప్రకారం అగ్ని, నీరు, మూర్ఖుడు, పాము, ధనిక కుటుంబానికి దూరంగా ఉండండి. ఇవి మిమ్మల్ని చంపగలవు. ఏదైనా ఆలోచన వల్ల మన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లితే దానికి దూరంగా ఉండడం మంచిది. మన జీవితాలను మనం సరిగా చూసుకోవాలి. జీవితం నాశనమయ్యే నిర్ణయాలు తీసుకోకూడదు.
కొన్ని విషయాలను దాచుకోవాలి
చాణక్య నీతి ప్రకారం మనం కొన్ని విషయాలను దాచుకోవడం చాలా ముఖ్యం. అపరిచితులతో రహస్యాలు పంచుకోకూడదు. ప్రధానంగా నీకు వచ్చిన జబ్బు, వాడుతున్న మందు, మనం చేసిన దాన ధర్మం, ఇంట్లో గొడవలు, నీ భార్య రహస్య ఆలోచనలు, నీకిష్టం లేని తిండి గురించి ఎవరితో చెప్పకూడదు. ఈ విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. ఒకటి లేదా మరొకటి ఈ ఆలోచనలు మీ జీవితానికి ప్రమాదాన్ని తెస్తాయి.
జీవితమంటేనే పోరాటం
జీవితమంటే ఇక్కడ కష్టాలు, సంతోషాలు సర్వసాధారణం. వీటన్నింటికీ చావు పరిష్కారం కాదు. కొన్నిసార్లు ఇతర వ్యక్తులు మన జీవితంలో ప్రమాదం తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో, జాగ్రత్తగా నడవడం మంచిది. చాణక్య నీతి ప్రకారం ఆనందంగా జీవించాలి. ఇతరులతో పోల్చుకోకూడదు. కష్టాలతో పోరాడాలి. జీవితంతో యుద్ధం చేసినప్పుడే మీరు విజయానికి చేరుతారని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడి సూత్రాలను పాటిస్తే జీవితం విజయం కచ్చితంగా వస్తుంది. గెలుపు కాస్త లేటుగా వచ్చిన రావడం మాత్రం పక్కా. అందుకే ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. ధైర్యంతో ముందుకు సాగాలి