Holi festival: 2024 లో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది? హోలికా దహన్ వేడుక ఎప్పుడు జరుపుకుంటారు
Holi festival: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ ఏ తేదీన వచ్చిందంటే..
Holi festival: చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సంబరంగా జరుపుకునే పండుగ్ హోలీ. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. మొదటి రోజు హోలిక దహన్ నిర్వహిస్తారు. దీన్ని చోటీ హోలీ అని కూడా పిలుస్తారు. రెండో రోజు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకుంటారు.
సాధారణంగా ఫిబ్రవరి చివరి రోజులు లేదా మార్చిలో హోలీ పండుగ వస్తుంది. 2024లో హోలీ పండుగ మార్చి 25 న వచ్చునది. మార్చి 24 న హోలికా దహనం నిర్వహించనున్నారు. హోలికా దహన్ లో భధ్రకి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు.
హోలీ సమయం
2024 లో హోలికా దాహం శుభ సమయం రాత్రి 7.19 గంటల నుంచి 9.18 వరకు ఉంది. 2023 లో వచ్చిన హోలీ 2024 లో వచ్చే హోలీ పండుగ తేదీల్లో వ్యత్యాసం వచ్చింది. 2023 లో మార్చి 6న హోలీ జరుపుకోగా 2024 లో మార్చి 25న నిర్వహిస్తున్నారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం హోలికా దహనాన్ని ఫాల్గుణ పూర్ణిమ ప్రదోష వ్యాపిని సమయంలో లేదా భద్ర లేని ముహూర్తంలో మాత్రమే చేస్తారు. అందువల్లే ఈ ఏడాది కాస్త ఆలస్యంగా హోలీ పండుగ వస్తుంది.
హోలీ- మార్చి 25, 2024
హోలికా దహన్ లేదా చోటి హోలీ- మార్చి 24, 2024
హోలీ పండుగ వచ్చిన రోజే చంద్రగ్రహణం కూడా రావడం విశేషం. అయితే భారత్ లో చంద్రగ్రహణం ప్రభావం ఏ మాత్రం ఉండదు. చంద్రగ్రహణం భారత్ లో కనిపించకపోవడం వల్ల సుతక్ కాలం కూడా చెల్లుబాటులో ఉండదు.
హోలీ వెనుక కథలు
పురాణాల ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి చావు రాకుండా ఉండేలా వరం పొందుతాడు. తనకి చావు లేదని గర్వంతో దేవతల మీద దండెత్తాడు. మానవులు ఎవరూ ఏ దేవుళ్ళని ఆరాధించేందుకు వీలు లేదని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. కానీ హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని ఆరాధించాడు. దీంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు కొడుకుని చంపేయాలని నిర్ణయించుకుంటాడు.
హిరణ్యకశిపుడు సోదరి హోలిక ఎప్పుడు మంటల్లో ఉంటుంది. ఆమెకి మంటలు అంటుకోకుండా రక్షణ కవచం ఉంటుంది. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చితిలో కూర్చోమని హిరణ్యకశిపుడు చెప్తాడు. ఆమె అలాగే చేస్తుంది. కానీ ప్రహ్లాదుడు విష్ణువుని ఆరాధించడం వల్ల ఆ మంటలు అతడిని ఏమి చేయలేకపోతాయి. మంటల్లో హోలికా దహనం అవుతుంది. అందుకు గుర్తుగా హోలికా దహనం నిర్వహిస్తారు.
రాధాకృష్ణుల ప్రేమ
హోలీ పండుగ వెనుక మరొక కథ కూడా ఉంది. కృష్ణుడు రాధ మీద ప్రేమతో రంగులు పూయడానికి వెళతాడు. అక్కడ ఉన్న గోపికలకు కూడా రంగులు పూస్తాడు. ఆ సమయంలో కృష్ణుడిని కొట్టేందుకు గోపికలు కర్రలతో వెంబడిస్తారు. ఉత్తరప్రదేశ్ లో హోలీ వేడుకలో ఇదే సంప్రదాయం పాటిస్తారు. లాత్మార్ హోలీ పేరుతో ఇక్కడ వేడుకలు నిర్వహిస్తారు. అక్కడి మహిళలు తమ భర్తలని కర్రలతో కొడతారు. అయితే ఇందులో ప్రేమ తప్ప వారిని కొట్టాలనే ఉద్దేశంతో మాత్రం చేయరు.
హోలీ రోజు నుంచి వసంత కాలం ప్రారంభమవుతుంది. చలి కాలం ముగిసి వసంత రుతువుకి ఆహ్వానం పలకడం కూడా ఆ రోజు నుంచే మొదలవుతుంది. ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల చర్మం చికాకు పెడుతుంది. ఆ సమయంలో రంగులు చల్లుకోవడం వల్ల చికాకు తగ్గుతుందని నమ్ముతారు.