Jyeshtha amavasya: రేపే జ్యేష్ఠ అమావాస్య.. ఇవి దానం చేసి ఇలా చేస్తే శని దోషాల నుంచి విముక్తి-when is jyeshtha amavasya on 5th or 6th july know the best time for bathing and donation ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jyeshtha Amavasya: రేపే జ్యేష్ఠ అమావాస్య.. ఇవి దానం చేసి ఇలా చేస్తే శని దోషాల నుంచి విముక్తి

Jyeshtha amavasya: రేపే జ్యేష్ఠ అమావాస్య.. ఇవి దానం చేసి ఇలా చేస్తే శని దోషాల నుంచి విముక్తి

Gunti Soundarya HT Telugu
Jul 04, 2024 06:43 PM IST

Jyeshtha amavasya: జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి అమావాస్య జులై 5వ తేదీ వచ్చింది. ఈరోజు స్నానం, దానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఏయే వస్తువులు దానం చేస్తే శని దోషాల నుంచి విముక్తి కలుగుతుందో తెలుసుకుందాం.

జ్యేష్ఠ అమావాస్య రోజు ఏం చేయాలి?
జ్యేష్ఠ అమావాస్య రోజు ఏం చేయాలి?

Jyeshtha amavasya: జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, పూర్వీకులకు నైవేద్యాలు పెట్టడం, దానాలు చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. 

హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య కృష్ణ పక్షం చివరిలో వస్తుంది. పూర్ణిమ ప్రతి నెల శుక్ల పక్షం చివరిలో వస్తుంది. హిందూ క్యాలెండర్‌లో ఒక సంవత్సరంలో మొత్తం పన్నెండు అమావాస్యలు పేర్కొనబడ్డాయి. హిందూ క్యాలెండర్‌లోని మూడో నెల జ్యేష్ఠ మాసంలో అమావాస్య ఎప్పుడు వచ్చింది? స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకోండి.

జ్యేష్ఠ అమావాస్య 2024 తేదీ

ఈ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం జూలై 05న వచ్చింది. అమావాస్య రోజున శుభకార్యాలు నిషిద్ధమని నమ్ముతారు. జ్యేష్ఠ కృష్ణ అమావాస్య తిథి జూలై 05వ తేదీ ఉదయం 04:57 గంటలకు ప్రారంభమై జూలై 06వ తేదీ ఉదయం 04:26 వరకు కొనసాగుతుంది.

స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం

జ్యేష్ఠ అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి. స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా దానం చేయాలని నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు స్నానం చేయడం చాలా మంచిది. ఈ రోజు తెల్లవారుజామున 04:08 గంటలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై 05:29 వరకు కొనసాగుతుంది.

దానం చేయడానికి అనుకూలమైన సమయం 

జ్యేష్ఠ అమావాస్య రోజున దానానికి అనుకూలమైన సమయం ఉదయం 07:13 AM నుండి 08:57 AM వరకు ఉంటుంది. దీని తరువాత, 08:57 AM నుండి 10:41 AM వరకు దానం చేయడం ఉత్తమం. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:54 వరకు ఉంటుంది.

జ్యేష్ఠ అమావాస్య రోజున చేయవలసినవి

అమావాస్య రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ ఉదయం రావి చెట్టుకు నీరు సమర్పించండి. మీ పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించండి. అవసరమైన వారికి ఆహారం, బట్టలు, ఇతర అవసరమైన వస్తువులను దానం చేయండి. సాయంత్రం వేళ రావి చెట్టు కింద  దీపం వెలిగించండి. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున శని ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం ఉత్తమమైనదిగా భావిస్తారు.

శని దోషాలు తొలగిపోయేందుకు 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారికి శని సడే సతి, దయ్యా ప్రతికూల ప్రభావం ఉంటుంది. శని అనుగ్రహం పొందటం కోసం శని చాలీసా పఠించడం చేయవచ్చు. 

పితృ దోష నివారణ

తండ్రికి కోపం వస్తే కుటుంబంలో కష్టాల కొండెక్కుతుంది. చిన్న చిన్న పనులకు కూడా ఆటంకాలు మొదలవుతాయి. మీరు మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందాలనుకుంటే లేదా పితృదోషం నుండి విముక్తి పొందాలనుకుంటే జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున పితృ కవచాన్ని పఠించండి. ఈ పారాయణంతో పాట మీరు పితృ స్తోత్రం లేదా పితృ సూక్తం కూడా పఠించవచ్చు. ఇది పూర్వీకుల ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది, పితృ దోషాన్ని కూడా తొలగిస్తుంది.

శివారాధన

జ్యేష్ఠ అమావాస్య రోజున భోలేనాథ్‌ని పూజించడం వల్ల శనిదేవుని చెడు ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఈ రోజున శివుడిని పూజించడం, పంచామృతాలతో జలాభిషేకం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో శనిగ్రహం సడేసతి చెడు ప్రభావాలను తగ్గించడానికి, పితృ దోషం, సర్ప దోషాల నుండి ఉపశమనం పొందడానికి శివలింగంపై బిల్వ పత్రం, గంగా జలం, పచ్చి పాలు సమర్పించి శివ చాలీసా పఠించండి. ఇది కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణాన్ని నిర్వహిస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

 

Whats_app_banner