Shani devudu: ఈ రత్నం ధరించారంటే ఏలినాటి శని, మహాదశ ప్రభావాల నుంచి విముక్తి పొందొచ్చు
Shani devudu: రత్న శాస్త్రం ప్రకారం శని అశుభ ప్రభావాలను నివారించడానికి నీలం రత్నాన్ని ధరించడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీనిని ధరించడం వలన ఏలినాటి శని, అర్థాష్టమ శని, మహాదశ నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
Shani devudu: జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం జూన్ 30 నుంచి కుంభ రాశిలో న్యాయ దేవుడు శని తిరోగమన ప్రయాణం ప్రారంభించాడు. శని తిరోగమన స్థితి ప్రజల మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని ఒక మతపరమైన నమ్మకం ఉంది.
కొన్ని రాశులపై ఏలినాటి శని, అర్థాష్టమ శని, శని మహాదశ కొనసాగుతున్నాయి. శని తిరోగమన సంచారం ఆ రాశుల సమస్యలను చాలా రెట్లు పెంచుతుంది. ఈ సమయంలో మకరం, కుంభం, మీన రాశులలో శని సడే సతి జరుగుతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి అర్థాష్టమ శని కొనసాగుతోంది. ఈ సమయాల్లో అనేక కష్టాలు ఎదురవుతాయి.
శనిదేవుడు మంచి, చెడు పనుల ఆధారంగా ఒక వ్యక్తికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు. శనిదేవుని హానికరమైన ప్రభావాలను నివారించడానికి నీలం రత్నాన్ని ధరించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది శని వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని విశ్వసిస్తారు. అయితే దానిని ధరించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. నీలమణిని ఎవరు ధరించాలి? అందుకు అనుసరించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం.
నీలమణి ధరించడానికి నియమాలు
నీలం రత్నాన్ని వెండి లేదా బంగారు ఉంగరంలో ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు.
ఈ రత్నాన్ని శనివారం ఉదయం 5 నుండి 9 గంటల మధ్య లేదా సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
నీలం రత్నాన్ని ధరించే ముందు ఖచ్చితంగా జ్యోతిష్య సలహా తీసుకోండి. పురుషులు నీలం రత్నాన్ని కుడి చేతి వేలికి ధరించవచ్చు. అదే సమయంలో మహిళలు ఈ రత్నాన్ని ఏ చేతిలోనైనా ధరించవచ్చు.
ఇది కాకుండా మీరు నీలమణి లాకెట్టును కూడా ధరించవచ్చు.
ఈ రత్నాన్ని ధరించడానికి ముందుగా దాన్ని గంగా జలంలో, పచ్చి ఆవు పాలలో ముంచండి. గంగాజలంతో శుద్ధి చేసి పూజ చేసిన తర్వాత మాత్రమే ధరించాలి.
ఇప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత ఉంగరం ధరించండి.
నీలమణి ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
నీలమణి ధరించడం నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ఒక వ్యక్తి ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కోసం అనేక అవకాశాలను పొందుతాడు. శనిగ్రహం అననుకూల ప్రభావాలను వదిలించుకోవడానికి నీలమణిని ధరించడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. నీలమణిని ధరించడం వల్ల సంపద పెరుగుతుందని, అదృష్టం ప్రతి పనిలో మనిషికి మద్దతునిస్తుందని చెబుతారు. వ్యాధులు, దోషాల నుండి ఉపశమనం పొందేందుకు నీలమణిని ధరించడం చాలా శుభప్రదమని చెబుతారు.
ఎవరు ధరించాలి?
జ్యోతిషశాస్త్రం ప్రకారం నీలమణి రత్నం ఎవరు ఎలా పడితే అలా ధరించకూడదు. కొన్ని రాశుల వారికి ఈ రత్నం ధరించడం వల్ల ప్రయోజనాల కంటే అనార్థాలు జరిగే అవకాశం ఉండవచ్చు.
వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశుల వాళ్ళు నీలమణి ధరించవచ్చు. అదే సమయంలో మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశుల వారు ఈ రత్నాన్ని ధరించడం మానుకోవాలి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.