Grahana yogam: గ్రహణ యోగం అంటే ఏంటి? దీని ప్రభావం వల్ల ఎదురయ్యే అనార్థాలు ఏంటి?-what is the meaning of grahana yogam how it will form and what are the effects of this yogam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Grahana Yogam: గ్రహణ యోగం అంటే ఏంటి? దీని ప్రభావం వల్ల ఎదురయ్యే అనార్థాలు ఏంటి?

Grahana yogam: గ్రహణ యోగం అంటే ఏంటి? దీని ప్రభావం వల్ల ఎదురయ్యే అనార్థాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jul 03, 2024 09:01 AM IST

Grahana yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ యోగాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. అసలు ఈ యోగం ఎలా ఏర్పడుతుంది? దీని ప్రభావాలు ఏంటి? వాటిని నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

గ్రహణ యోగం అంటే ఏంటి?
గ్రహణ యోగం అంటే ఏంటి?

Grahana yogam: గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశిని, స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ వేరే గ్రహంతో సంయోగం చెందుతాయి. దీని వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అటువంటి అశుభ యోగాలలో ఒకటి గ్రహణ యోగం. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని అశుభయోగంగా పరిగణిస్తారు. 

గ్రహణ యోగం అంటే ఏంటి?

నవగ్రహాలలో రాహువు, కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. ఇవి ఎప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తాయి. జాతకంలో రాహువు అశుభ స్థానం జీవితంలో జరిగే ఆకస్మిక సంఘటనలను సూచిస్తుంది. ఇక చంద్రుడు చల్లని మనసు కలిగిన వాడని చెబుతారు. జ్యోతిష్యశాస్త్రంలో చంద్రుడిని స్త్రీ, మనస్సుకు కారకుడిగా పిలుస్తారు. 

అదే సమయంలో జాతకంలో చంద్రుని స్థానం వ్యక్తి మానసిక, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు రాహు, చంద్ర కలయిక జాతకంలో చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. ఈ రాహు-చంద్ర కలయిక శుభప్రదంగా పరిగణించరు. ఎందుకంటే ఇవి రెండూ శత్రు గ్రహాలుగా చెప్తారు. ఇది ఒక లోపంగా పరిగణించబడుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడేదే గ్రహణ యోగం. 

రాహువు, చంద్రుని కలయిక ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. ఈ కలయిక ఒక వ్యక్తి జీవితంలో అనేక ప్రతికూల మార్పులను తెస్తుంది. వ్యక్తి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. చంద్రుడు, రాహువు గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి జూదగాడు, మద్యానికి బానిస కావచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. క్రమంగా అందరితో సంబంధాలు బలహీనపడతాయి. రాహు-చంద్ర కలయిక వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు, దానిని నివారించే సులభమైన మార్గాలను తెలుసుకుందాం.

రాహు-చంద్ర కలయిక ప్రభావం

రాహు-చంద్ర కలయికను గ్రహణ యోగం అంటారు. దీని కారణంగా వ్యక్తికి డిప్రెషన్ లేదా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. చంద్రుడు, రాహువు సంయోగం వ్యక్తి వైవాహిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుమానాలు ఏర్పడతాయి. 

ఈ రెండు గ్రహాల కలయిక వల్ల జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి. రహస్య శత్రువుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి గండం ఏర్పడే అవకాశం ఉంది. జాతకంలో రాహువు స్థానం క్షీణించినప్పుడు వ్యక్తి వ్యాధులతో బాధపడటం ప్రారంభిస్తాడు.

గ్రహణ యోగం నివారణ మార్గాలు 

రాహువు, చంద్రుడి కలయిక వల్ల ఏర్పడే అననుకూల ప్రభావాలను నివారించడానికి ఓం భ్రాం భ్రాం భ్రూన్ సా రాహువే నమః అనే మంత్రాన్ని జపించండి.

రాహు-చంద్ర సంయోగం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి మీరు పగడపు రత్నం ధరించవచ్చు. అయితే ఇది ధరించే ముందు జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలి. అమెథిస్ట్ లేదా ఒనిక్స్ రత్నాన్ని ధరించవచ్చు.

ఈ సంయోగం చెడు ప్రభావాలను నివారించడానికి శ్రావణ మాసంలోని సోమవారాలు ఉపవాసం ఆచరించడం మంచిది. శివయ్య ఆశీర్వాదాలతో పాటు రాహువు అనుగ్రహం లభిస్తుంది. 

ఇది కాకుండా సోమవారం తెల్లటి వస్తువులను దానం చేయండి. భోలేనాథ్‌ను ఆరాధించడం ద్వారా రాహు, చంద్రుల వల్ల ఏర్పడే అశుభ ప్రభావాల నుండి బయటపడవచ్చు.

 

Whats_app_banner