Planets conjunction: మూడు గ్రహాల కలయిక.. ఈ 3 రాశుల వారి జీవితంలో టెన్షన్ వాతావారణం-sun venus mercury conjunction will create tenions in these zodiac signs life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planets Conjunction: మూడు గ్రహాల కలయిక.. ఈ 3 రాశుల వారి జీవితంలో టెన్షన్ వాతావారణం

Planets conjunction: మూడు గ్రహాల కలయిక.. ఈ 3 రాశుల వారి జీవితంలో టెన్షన్ వాతావారణం

Gunti Soundarya HT Telugu

Planets conjunction: మిథున రాశిలో సూర్యుడు, శుక్రుడు, బుధుడి సంయోగం జరిగింది. దీని ప్రభావం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. అయితే ఈ మూడు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.

మూడు గ్రహాల కలయిక (freepik)

Planets conjunction: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం వల్ల కొన్ని సార్లు రాజయోగాలు, మరికొన్ని సార్లు అశుభ యోగాలు ఏర్పరుస్తున్నాయి. దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద ఉంటుంది. అందుకే గ్రహాల సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రాధాన్యత ఉంటుంది. జూన్ నెలలో అనేక రాజయోగాలకు మిథున రాశి వేదిక అయ్యింది.

ప్రస్తుతం మూడు పెద్ద గ్రహాలు మిథున రాశిలో సంచరిస్తున్నాయి. జూన్ 12 సంపదలు ప్రసాదించే శుక్రుడు మొదటిగా తన సొంత రాశి అయిన మిథున రాశి ప్రవేశం చేశాడు. రెండు రోజుల వ్యవధిలో జూన్ 14న గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రవేశించాడు. జూన్ 15న గ్రహాల రాజు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఇక బుధుడు మిథున రాశిలో భద్రమహా పురుష రాజయోగాన్ని ఏర్పరిచాడు. పంచ మహా పురుష రాజయోగాలలో ఇదీ ఒకటి. బుధుడు తన సొంత రాశులైన కన్య లేదా మిథున రాశిలోకి ప్రవేశించి, లగ్నం నుండి మొదటి, నాల్గవ, ఏడవ లేదా పదవ ఇంటిని ఆక్రమించినప్పుడు ఈ ప్రత్యేక యోగం సృష్టించబడుతుంది.

సూర్యుడు ప్రవేశించిన వెంటనే మిథునరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. జూన్ 28 వరకు మిథునరాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుని కలయిక ఉంటుంది. ఈ మూడు గ్రహాల కలయికతో నాలుగు రాజయోగాలు ఏర్పడ్డాయి. బుధుడు, సూర్యుడు కలిసి ఏడాది తర్వాత మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. అలాగే సూర్యుడు, శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పడింది. శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఇచ్చాయి. ఇక బుధుడు, సూర్యుడు, శుక్రుడు కలిసి త్రిగ్రాహి యోగం సృష్టించాయి. అయితే త్రిగ్రాహి యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఒత్తిడి పెరుగుతుంది. అవి ఏ రాశులో చూద్దాం.

కర్కాటక రాశి

మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడి కలయిక చాలా ప్రయోజనకరంగా పరిగణింప్రయోజనకరమైన ఫలితాలు ఇవ్వదు. మీ కెరీర్‌లో సహోద్యోగులతో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మితిమీరిన ఖర్చు మనసును కలవరపెడతాయి. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి.

ధనుస్సు రాశి

బుధుడు, శుక్రుడు, సూర్యుని కలయిక ధనుస్సు రాశి వారికి లాభదాయకంగా ఉండదు. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతికూల భావనలు మనసును చికాకుకు గురి చేస్తాయి. మీ భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు.

మీన రాశి

మీన రాశి వారికి త్రిగ్రాహి యోగం శుభప్రదంగా పరిగణించబడదు. ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మీరు జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. జీవితంలో అలజడి నెలకొంటుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.