Budhaditya raja yogam: ఏడాది తర్వాత మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం.. లాభపడే రాశుల జాబితా ఇదే-after one year budhaditya raja yogam form in mithuna rasi with conjunction of sun and mercury ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Budhaditya Raja Yogam: ఏడాది తర్వాత మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం.. లాభపడే రాశుల జాబితా ఇదే

Budhaditya raja yogam: ఏడాది తర్వాత మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం.. లాభపడే రాశుల జాబితా ఇదే

Gunti Soundarya HT Telugu
Jun 15, 2024 02:02 PM IST

Budhaditya raja yogam: మిథున రాశిలో బుధుడు, సూర్యుడు కలిసి ఏడాది తర్వాత బుధాదిత్య రాజయోగం ఇస్తున్నారు. దీని వల్ల మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

మిథున రాశిలో బుధాదిత్య యోగం
మిథున రాశిలో బుధాదిత్య యోగం (Pixabay)

Budhaditya raja yogam: గ్రహాల రాజు సూర్య భగవానుడు ఈరోజు(జూన్ 15) నుంచి మిథున రాశిలో తన ప్రయాణం ప్రారంభించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ప్రత్యేకమైనది. దీన్ని మిథున సంక్రాంతి అంటారు. ఒడిశాలో మిథున సంక్రాంతిని వేడుకగా చేసుకుంటారు. మిథున రాశిలో ఇప్పటికే బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు.

జులై 16వరకు సూర్యుడు మిథున రాశిలోనే ఉంటారు. శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ యోగం ఇస్తున్నారు. దీనితో పాటు బుధుడు, సూర్యుడు కలసి ఏడాది తర్వాత మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పరుస్తున్నారు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అదృష్టవంతమైన రాజయోగంగా పరిగణిస్తారు. ఈ విశేషమైన కలయిక ముఖ్యంగా మూడు రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

మిథున రాశిలో సూర్య సంచారం వ్యక్తిత్వం, వృత్తి, కమ్యూనికేషన్ సామర్థ్యాలను బలపరుస్తుంది. వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన జీవితంలో వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడం సులభం అవుతుంది. ఈ సమయంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడపటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ రెండు రాజయోగాలతో పాటు సూర్యుడు శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం కూడా అందిస్తారు.

వృషభ రాశి

సూర్యుడు, బుధుడు కలిసి వృషభ రాశి వారికి అద్భుతమైన లాభాలు ఇస్తున్నాడు. ఈ కాలంలో వస్తు సంపదల కోసం డబ్బు వెచ్చిస్తారు. తగినంత డబ్బు ఉంటుంది. కోరికలన్నీ నెరవేరుతాయి. అద్భుతమైన వార్తలు వుంటారు. పని చేసే వృత్తి నిపుణులు ఆదాయంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి. సంఘంలో మీ స్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. అప్పుడే మీరు జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించగలుగుతారు.

మిథున రాశి

బుధాదిత్య రాజయోగం వల్ల శుభ ఫలితాలు పొందే రెండవ రాశి మిథునం. ఈ రాశిలోనే శుభకరమైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఊహించని ధనలాభం. అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారు. వృత్తిపరమైన జీవితంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వివాహిత వ్యక్తులు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. నాయకత్వ నైపుణ్యాలతో అందరి ప్రశంసలు అందుకుంటారు. అవసరమైన సమయాల్లో తండ్రి, గురువు నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహ రాశి

బుధాదిత్య రాజయోగంతో సింహ రాశి వారికి డబ్బు సంపాదించేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇది జీవనశైలిలో మార్పులు తీసుకొస్తుంది. కారు కొనుగోలు చేసే అవకాశం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మారుతుంది. వృత్తిపరంగా ముందుకు సాగుతారు. వేతన పెంపు లభిస్తుంది. పనికి కూడా ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

సూర్య సంచారము ఎవరికి అనుకూలంగా లేదు?

కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి మిథున రాశిలో సూర్యభగవానుడు సంచరించడం శుభప్రదంగా పరిగణించబడదు. మీరు జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. మీ కెరీర్‌లో సహోద్యోగులతో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

WhatsApp channel