తెలుగు న్యూస్ / ఫోటో /
Mercury Transit: మిథునరాశిలో ఏర్పడబోతున్న బుధాదిత్య రాజయోగం, ఈ రాశుల వారికి పండగే
Mercury Transit 2024: జూన్లో సూర్యుడు, బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. దీని వల్ల బుద్ధాదిత్య రాజ యోగం ఏర్పడుతుంది. బుధుడు… సూర్యుడి కంటే ముందే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులకు మేలు జరుగుతుంది.
(1 / 6)
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ కాలానుగుణంగా తమ రాశిని మార్చుకుని ఇతర గ్రహాలతో కలయికను ఏర్పరుస్తాయి. గ్రహాల సంచారం, గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగాలు కొన్ని రాశుల వారికి మేలు చేస్తాయి.
(2 / 6)
జూన్ లో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు రాశిని మారుస్తారు. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్లడం వల్ల అన్ని రాశులు ప్రభావితమవుతాయి. సూర్యుడు , బుధుడు ఇద్దరూ ఈ నెలలో మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. మిథున రాశిలో సూర్యుడు, బుధుడి కలయికతో బుద్ధాదిత్య రాజ యోగం ఏర్పడుతుంది.
(3 / 6)
గ్రహాల రాకుమారుడు బుధుడు, జ్ఞానం, మాట, వ్యాపారానికి అధిపతి అయిన బుధుడు. ఈ ఏడాది జూన్ 14 రాత్రి 11:09 గంటలకు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి తరువాత సూర్యభగవానుడు జూన్ 15 న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో బుధుడి సంచారం వల్ల అనేక రాశుల వారికి డబ్బు, ఆనందం వంటి ప్రయోజనాలు పొందుతారు.
(4 / 6)
వృషభ రాశి: జూన్ 14న బుధుడు వృషభ రాశి నుండి రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. తెలివితేటలు పెరుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు బాగా అభివృద్ధి చెందుతారు.
(5 / 6)
మిథున రాశి: జూన్ 14న బుధుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఫలితంగా మిథున రాశి వారికి బుధుడి ఆశీస్సులు లభిస్తాయి. మిథున రాశి వారికి 1వ, 4వ ఇంటి అధిపతి. బుధ సంచారం వల్ల మిథున రాశి వారికి మేధోశక్తి పెరుగుతుంది. పనిలో లాభం,ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు