Lions gate portal 2024: లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటి? మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఈరోజు ఏం చేయాలి?
Lions gate portal 2024: ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా బలపడేందుకు ఉపయోగపడే అనువైన రోజు ఆగస్ట్ 8. ఈరోజును లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. దీని ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Lions gate portal 2024: ఆగస్ట్ 8 చాలా ప్రత్యేకమైనది. న్యూమరాలజీ ప్రకారం ఎనిమిది సంఖ్య అదృష్టం, సంపద, పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా చూస్తారు. ఇది అంతులేని శక్తిని సూచిస్తుంది. 8-08-2024 రోజును లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. సింహ రాశిలో సూర్యుడు రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ తో సమలేఖనం చేసినప్పుడు ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఏర్పడుతుంది. ఈ అమరిక జులై 28 నుంచి ఆగస్ట్ 12 వరకు జరుగుతుంది. అయితే లయన్స్ గేట్ పోర్టల్ ఆగస్ట్ 8న అత్యంత శక్తివంతమైన రోజుగా మారుతుంది.
ఈ సమయంలో బుధుడు కూడా తిరోగమన దశలో ఉంటాడు. మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించుకునేందుకు ఈరోజు ఉపయోగపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీలోని ప్రతికూల ఆలోచనల నుంచి బయట పడేందుకు ఈరోజు కొన్ని పనులు చేయడం చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.
జ్యోతిష్యశాస్త్ర పరంగా లయన్స్ గేట్ పోర్టల్ ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాల మధ్య శక్తి ప్రవాహాన్ని తెరుస్తుందని నమ్ముతారు. ఇది వ్యక్తిగత పెరుగుదల, ప్రవర్తన, ఆధ్యాత్మిక మేల్కోలుపులకు ఇది అనువైన సమయం. మీ గురించి మీరు తెలుసుకునేందుకు ఇది ఉత్తమమైన సమయం. మీ శక్తిని ఉపయోగించుకునేందుకు మీ కలలు, లక్ష్యాలు, కోరికల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. స్వీయ ఆలోచనలు చేసుకునేందుకు అనువైన కాలం ఇది.
మీ భవిష్యత్ కలలు, లక్ష్యాలను గుర్తించిన తర్వాత అవి జరిగితే ఎలా ఉంటాయో ఊహించుకోండి. వాటిని ఒక బోర్డు మీద రాసుకోండి. వాటి గురించి ఆలోచిస్తూ ధ్యానం చేసుకోండి. కృతజ్ఞతా భావాన్ని ఆచరించేందుకు ఇది గొప్ప సమయం అనే విషయం గుర్తుంచుకోండి.
ఆవేశం తగ్గించుకోవాలి
మీ ఆవేశాన్ని అణిచివేసుకోవడం ఒక్కోసారి శక్తికి మించింది అవుతుంది. ఈ శక్తిని వినియోగించుకోవడానికి సురక్షితమైన స్థలం ఎంచుకుని బిగ్గరగా అరవండి. మీ కోపం, ఆవేశం, బాధ, భావోద్వేగాన్ని ఇలా చేసి వదిలించుకోవచ్చు. ఆధ్యాత్మిక బోధనలు వినడం వల్ల మీ శక్తిని తిరిగి పొందేందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
నెగటివ్ ఎనర్జీ నుంచి తప్పించుకునేందుకు
ఈరోజు నెగటివ్ ఎనర్జీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందువల్ల ప్రతికూల శక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం నల్ల ఉప్పు ఉపయోగించండి. మీ ఇంటి చుట్టూ ఈ ఉప్పును చల్లుకోవడం వల్ల ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది.
చీకటికి ధన్యవాదాలు చెప్పండి
మీలోని చీకటి కోణాలను గుర్తించి వాటికి ధన్యవాదాలు చెప్పండి. ఇవి కొన్ని సందర్భాలలో మిమ్మల్ని రక్షించేందుకు ఉపయోగపడే ఉంటాయి. తెల్లటి కొవ్వొత్తిని వెలిగించి మీ నీడ మిమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చిందో గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేయండి. ఆధ్యాత్మికత అనేది శాంతి, ప్రేమ, కాంతి గురించి మాత్రమే కాదు మీ పూర్తి శక్తిని స్వీకరించేందుకు సహాయపడుతుంది.
మీ శక్తి తెలుసుకోండి
కొన్ని సందర్భాలలో మీ శక్తి ఏంటో మీకు తెలియకపోవచ్చు. దాన్ని తెలుసుకునేందుకు లోతుగా శ్వాస తీసుకోండి. మీ ఆత్మను, మనసును ఏకం చేసే విధంగా ధ్యానం చేయాలి. మీరు ఇలా చేస్తున్నప్పుడు శరీరం జలధరించడం, ఉష్ణోగ్రతలో మార్పులు వంటి శారీరక అనుభూతులు చెందుతారు. ఈ ప్రక్రియ మీ శక్తి ఏంటో మీకు తెలియజేస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.