Lucky zodiac signs: డబుల్ రాజయోగాలు ఇచ్చిన విలాసాల అధిపతి- ఈ మూడు రాశుల వారి ఆదాయానికి కొదువ ఉండదు-venus transit in libra forms kendra trikona rajayogam and malavya yogam three zodiac signs get fortune ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: డబుల్ రాజయోగాలు ఇచ్చిన విలాసాల అధిపతి- ఈ మూడు రాశుల వారి ఆదాయానికి కొదువ ఉండదు

Lucky zodiac signs: డబుల్ రాజయోగాలు ఇచ్చిన విలాసాల అధిపతి- ఈ మూడు రాశుల వారి ఆదాయానికి కొదువ ఉండదు

Gunti Soundarya HT Telugu
Sep 19, 2024 01:00 PM IST

Lucky zodiac signs: విలాసాల అధిపతి శుక్రుడు తులా రాశిలో సంచరిస్తూ డబుల్ రాజయోగాలు ఇస్తున్నాడు. దీని ప్రభావం మూడు రాశుల వారి అదృష్టాన్ని మార్చేస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆదాయానికి కొదువ ఉండదు.

డబుల్ రాజయోగాలు ఇచ్చిన విలాసాల అధిపతి
డబుల్ రాజయోగాలు ఇచ్చిన విలాసాల అధిపతి

Lucky zodiac signs: విలాసాలకు అధిపతిగా పరిగణించే శుక్రుడు కాలానుగుణంగా రాశి చక్రాన్ని మారుస్తాడు. ప్రస్తుతం శుక్రుడు తన సొంత రాశి తులా రాశిలో సంచరిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా ఒక గ్రహం ఉన్నతమైన లేదా సొంత రాశిలో సంచరించినప్పుడు రాజయోగం, శుభ యోగం ఏర్పడుతుంది.

తులా రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం, మాలవ్య యోగం ఏర్పడ్డాయి. శుక్రుడు తన సొంత రాశిలో అంటే వృషభం, తుల రాశిలో సంచరించడం వల్ల మాలవ్య యోగం ఏర్పడుతుంది. దీనితో పాటు ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం కూడా శుభకరమైనది. వీటి ప్రభావంతో మూడు రాశుల తలరాత మారుతుంది. డబ్బు సంపాదిస్తారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. తులా రాశిలో శుక్రుడి సంచారం కారణంగా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా బహుళ ప్రయోజనాలను పొందే అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

తులా రాశి

తులా రాశి లగ్న గృహంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మాలవ్య, కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాశి వారికి చాలా ఫలవంతంగా ఉంటుంది. అన్నీ పనుల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కెరీర్ లో పురోగతికి దారులు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఊహించని ప్రదేశాల నుంచి డబ్బు చేతికి అందుతుంది. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. వివాహితులకు ఇది అనుకూలమైన కాలం. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో శాంతి, ఆనందం ఉంటుంది. ఒంటరి వ్యక్తులకు జీవిత భాగస్వామి లభిస్తుంది.

మకర రాశి

మకర రాశి వృత్తి, వ్యాపార గృహంలో శుక్రుడు సంచరిస్తాడు. అందువల్ల ఈ రెండు యోగాల ప్రభావం మకర రాశి వారి మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వివాహితులు సంతోషకరమైన జీవితం జీవిస్తారు. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయంతో ఉంటారు. వ్యాపారాలు చేసే వాళ్ళు గొప్ప లాభాలను ఆర్జించే అవకాశాన్ని పొందుతారు. మీరు మీ రంగంలో అగ్రగామిగా ఉంటారు. నిరుద్యోగులకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. పని చేసే సిబ్బంది కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు.

కుంభ రాశి

కుంభ రాశి తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. ఈ కాలం వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. తమ జీవితంలోని ప్రతి రంగంలో అదృష్టాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, పురోభివృద్ధి అవకాశాలను పొందుతారు. వ్యాపారవేత్తలు తమ వృత్తిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందటం వల్ల అనేక అవసరాలను తీర్చుకోగలుగుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. భౌతిక ఆనందం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం జీవిస్తారు. కెరీర్‌లో ఆకస్మిక విజయాలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. దేశంలో లేదా విదేశాలలో విహారయాత్రకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.