Lucky zodiac signs: నీడ గ్రహంతో గ్రహాల రాజు- సెప్టెంబర్ 16 నుంచి వీరి దశ మారబోతుంది, డబ్బే డబ్బు
Lucky zodiac signs: కన్యా రాశిలోకి మరో రెండు రోజుల్లో సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది. కన్యా రాశిలో సూర్య, కేతు సంయోగం జరగబోతుంది. దీని వల్ల ఆదాయం పెరగడంతో పాటు డబ్బు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది.
Lucky zodiac signs: సూర్యుడు ప్రతి నెల రాశిని మార్చుకుంటూ ఉంటాడు. మరో రెండు రోజుల్లో సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడ ఇప్పటికే కేతువు సంచరిస్తున్నాడు. 16 సెప్టెంబరు 2024న సూర్య దేవుడు రాత్రి 07:29 గంటలకు బుధుడికి చెందిన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.
17 అక్టోబర్ 2024 వరకు సూర్యుడు కన్యా రాశిలో ఉంటాడు. అప్పటి వరకు సూర్య, కేతు కలయిక జరుగుతుంది. కేతువు గతేడాది నుంచి కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది కేతువు తన రాశిని మార్చుకుంటాడు. సూర్య సంచారం వల్ల నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలుగుతుందో చూద్దాం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో పదకొండవ ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటే అది ఇప్పుడు పూర్తి అవుతుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక, మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. తీర్థయాత్రకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. ఆర్థిక రంగంలో చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వాళ్ళు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మకర రాశి
సూర్యుడు, కేతువు కలయిక మకర రాశి తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది. ప్రతి పనిలో అదృష్టం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. దాని వల్ల మీ అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో వారి గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వివిధ రంగాలలో పని చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ కు సంబంధించి మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు చాలా మేలు చేస్తాయి. తల్లిదండ్రులు మీకు అవసరమైన సమయంలో మద్ధతుగా నిలుస్తారు. జీవితం సంతోషంగా, సంపన్నంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి.
తులా రాశి
తులా రాశి పన్నెండో ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. తులా రాశి వారికి సూర్య కేతు కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి సూర్య భగవానుడు విశేష ఆశీస్సులు అందిస్తాడు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బు ఆదా చేయగలుగుతారు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ఇది అనువైన సమయం. వాటిని మీరు వృత్తిలో ఉపయోగించుకోవడం వల్ల పురోగతి లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఆధ్యాత్మికతవైపు ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీని వల్ల తమ లక్ష్యాలను, కలలను నెరవేర్చుకుంటారు. భవిష్యత్ కోసం డబ్బు ఆదా చేసుకుంటారు. అది మీకు అవసరమైన సమయంలో అక్కరకు వస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.