Malavya raja yogam: సొంత రాశిలో రాజయోగం ఇవ్వబోతున్న శుక్రుడు.. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతుంది-venus transit forms malavya rajyoga in tula rashi these zodiac signs bank balance rise ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Malavya Raja Yogam: సొంత రాశిలో రాజయోగం ఇవ్వబోతున్న శుక్రుడు.. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతుంది

Malavya raja yogam: సొంత రాశిలో రాజయోగం ఇవ్వబోతున్న శుక్రుడు.. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతుంది

Gunti Soundarya HT Telugu
Aug 12, 2024 06:00 PM IST

Malavya raja yogam: సెప్టెంబర్ నెలలో ధనాన్ని ఇచ్చే శుక్రుడు తన సొంత రాశి తులా రాశిలో సంచరించబోతున్నాడు. దీని వలన చాలా శుభప్రదమైన మాలవ్య రాజ్యయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల అదృష్టాన్ని మారుస్తుంది.

తులా రాశిలో శుక్రుడి మాలవ్య రాజయోగం
తులా రాశిలో శుక్రుడి మాలవ్య రాజయోగం

Malavya raja yogam: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశిచక్రం, నక్షత్రాలను మారుస్తాయి. ఇది ప్రజల మనస్సుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సంపద, శ్రేయస్సు, ఆనందం, విలాసవంతమైన జీవితానికి కారకంగా భావిస్తారు.

శుక్రుని శుభ ప్రభావం వ్యక్తి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు. ఆగస్ట్ 25న శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దృక్ పంచాంగ్ ప్రకారం సెప్టెంబర్ 18 న సంపదను ఇచ్చే శుక్రుడు తన స్వంత రాశిలో తులా రాశిలోకి అడుగుపెడతాడు. దాని వల్ల శుభకరమైన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఏడాది తర్వాత సొంత రాశిలో శుక్రుడు ఈ రాజయోగం ఇస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో మాలవ్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీని పవిత్ర ప్రభావం జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపదను తెస్తుందని నమ్ముతారు. మాలవ్య రాజ్యయోగం ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

మాలవ్య రాజయోగం అంటే ఏమిటి?

జాతకంలో మాలవ్య రాజయోగం ఏర్పడటం వల్ల సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయని నమ్ముతారు. దీనిని పంచ మహాపురుష యోగంగా పరిగణిస్తారు. ఈ యోగాన్ని సృష్టించడం వల్ల మనిషి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవితం సుఖాలలో గడిచిపోతుంది. సంపద వృద్ధి అధికంగా ఉంటుంది. ఈ యోగంతో మెరిసే ఈరాశులు ఇవే.

తులా రాశి

మాలవ్య రాజయోగం ఏర్పడటం వల్ల తులా రాశి వారికి అదృష్టం కలుగుతుంది. ఈ రాశిలోనే శుక్రుడు సంచరించడం వల్ల ఈ అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది. అందువల్ల దీని శుభ ప్రభావం వల్ల మీ పనులన్నీ విజయవంతమవుతాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. భౌతిక సుఖాలలో జీవితాన్ని గడుపుతారు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. సంపద పెరిగే అవకాశం ఉంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి మాలవ్య రాజయోగం ఏర్పడటం శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. మీరు మీ కెరీర్‌లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిపోతారు.

మీన రాశి

శుక్రుడు తన సొంత రాశిలోకి వెళ్లడం మీన రాశి వారికి వరం కంటే తక్కువ కాదు. ఈ కాలంలో మీరు మీ ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని సాధించవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీకు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.