Malavya raja yogam: మాలవ్య రాజయోగం అంటే ఏంటి? దీని ప్రభావం పొందే నాలుగు రాశులు ఏవి?-what is malavya raja yogam what are the benefits of this yogam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Malavya Raja Yogam: మాలవ్య రాజయోగం అంటే ఏంటి? దీని ప్రభావం పొందే నాలుగు రాశులు ఏవి?

Malavya raja yogam: మాలవ్య రాజయోగం అంటే ఏంటి? దీని ప్రభావం పొందే నాలుగు రాశులు ఏవి?

Gunti Soundarya HT Telugu
Jun 03, 2024 07:19 PM IST

Malavya raja yogam: శుక్రుడు వృషభ రాశిలో సంచరించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడింది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అన్నీ లాభాలు ఉంటాయి.

మాలవ్య రాజయోగం అంటే ఏంటి?
మాలవ్య రాజయోగం అంటే ఏంటి?

Malavya raja yogam: పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటి మాలవ్య రాజయోగం. శుక్రుడి సంచారం వల్ల ఇది ఏర్పడుతుంది. ఆకర్షణ, గొప్పతనం, అదృష్టం, శ్రేయస్సు, ప్రేమ, వైభవానికి శుక్రుడు కారకుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాలవ్య రాజయోగం అత్యంత శుభ యోగాలలో ఒకటి. ప్రస్తుతం వృషభరాశిలో ఉన్న శుక్రుడి ప్రభావంతో ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

మాలవ్య రాజయోగం అంటే ఏంటి

శుక్రుడు జాతకంలోని మొదటి, నాలుగు, ఏడు, పదో ఇంట్లో ఉన్నప్పుడు, వృషభం, తుల లేదా ఉన్నతరాశి అయిన మీన రాశిలో ప్రవేశించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని కారణంగా ఒక వ్యక్తి ధైర్యవంతుడు, శక్తివంతుడు, అదృష్టవంతుడిగా మారతాడు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతి రంగంలోనూ అదృష్టం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

మాలవ్యరాజయోగం మొదటి ఇంట్లో ఏర్పడితే సంపద, సంతోషం, అదృష్టం, సామాజిక ప్రతిష్ట పెరుగుతాయి. నాలుగో ఇంట్లో ఏర్పడితే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భౌతిక సుఖాలతో జీవితం గడుపుతారు. సంపద సౌభాగ్యం పెరుగుతాయి. ఏడో ఇంట్లో ఏర్పడితే సినిమా, ఫ్యాషన్, కాస్మోటిక్, బ్యూటీషియన్, మ్యూజిషియన్, మోడలింగ్ రంగాల్లో అపాపరమైన విజయాలు సాధిస్తారు.

అదే పదో ఇంట్లో ఏర్పడితే సినిమా, వ్యాపారం, విమానయాన రంగాలలో డబ్బు సంపాదించేందుకు అనేక సువర్ణావకాశాలు లభిస్తాయి. ప్రతి రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు వృత్తిలో గొప్ప విజయాలు సాధిస్తారు .మాలవ్య రాజయోగం వ్యక్తిత్వాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఓపెన్ మైండెడ్ గా, ఆకర్షణీయంగా, ప్రశంసనీయంగా ఉంటారు. జూన్ 12 వరకు ఈ నాలుగు రాశుల వారు మాలవ్య రాజయోగం ప్రభావంతో ఫలితాలు అనుభవిస్తారు.

వృషభ రాశి

మాలవ్య రాజయోగం ఫలితంగా వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. అన్నీ కోరికలు నెరవేరుతాయి. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది ప్రయోజన సమయం అవుతుంది. విద్యార్థులు విజయవంతం అవుతారు. చాలా కాలంగా బాధపెడుతున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. రుణ బాధలనుంచి విముక్తి లభిస్తుంది.

కన్యా రాశి

మాలవ్య రాజయోగం కన్యా రాశి వారికి జీవితంలో ఆనందం తీసుకొస్తుంది. ఆర్థిక లాభం కోసం అవకాశాలు పెరుగుతాయి. అన్ని బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. వృత్తిపరమైన ప్రయోజనాల కోసం విదేశాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ మీరు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో స్నేహపూర్వకంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు .కొత్త ఇల్లు కొనేందుకు ఇది మంచి సమయం.

తులా రాశి

శుక్రుడు తులా రాశి వారికి శుభాలను ఇస్తున్నాడు. ప్రత్యర్థులు, శత్రువులు మీ దారిలోకి రాలేరు. ఈ యోగం మీకు స్నేహితులు ఎవరో తెలియజేస్తుంది. తోబుట్టువులతో బంధం బలపడుతుంది. కెరీర్ పరంగా ఉద్యోగం లభిస్తుంది. కొత్త సంస్థ ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం మంచిది. పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలు సంతోషాన్ని ఇస్తాయి. వారసత్వంగా పొందిన ఆస్తి ప్రయోజనాలను అందిస్తుంది.

కుంభ రాశి

మాలవ్య రాజయోగం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఉద్యోగం దొరుకుతుంది. ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు. మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లాభాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారు లేదా ఆస్తి కొనాలని మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్థులు ఈ సమయంలో అదృష్టవంతులు. ఉద్యోగస్తులకు ప్రశంసలు లభిస్తాయి.

WhatsApp channel