Vastu tips: ఈ మూడు వస్తువులు బహుమతిగా ఇచ్చారంటే మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుంది
Vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక పురోగతి కోసం కొన్ని నియమాలు, పరిహారాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుంది.
Vastu tips: కొన్ని వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదని ఇతరులతో పంచుకోకూడదని చెప్తారు. అలా చేయడం వల్ల జీవితంలో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులతో పంచుకోకూడని వస్తువులు ఎలా ఉన్నాయో అలాగే బహుమతులుగా ఇచ్చే వస్తువుల జాబితా కూడా ఉంది.
వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇతరులకు బహుమతిగా ఇవ్వడం వల్ల ఇంట్లో ఆనందం, సానుకూలత ఏర్పడతాయి. చాలా సార్లు మనం తెలియకుండా చేసే తప్పులు వాస్తు దోషాలను కలిగిస్తాయి. కొన్ని బహుమతులు ఇవ్వడం వల్ల జీవితంలో ఆనందం, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రంలో ఏ వస్తువులను బహుమతిగా ఇవ్వడం శుభప్రదంగా పరిగణించబడుతుందో తెలుసుకోండి. వాస్తు దోషాల నుండి విముక్తి పొందండి.
గణేశుడి విగ్రహం
వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుడిని వేడుకోవడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. జ్ఞానానికి దేవుడైన గణేశుడు మొదటి పూజించదగిన దేవుడు. వారు అదృష్టం, శ్రేయస్సు చిహ్నంగా భావిస్తారు. గృహ ప్రవేశం వంటి శుభకార్యం సమయంలో మీరు ఎవరికైనా గణేశుడి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడం శుభప్రదం అని నమ్ముతారు.
క్రిస్టల్ లోటస్
వాస్తు శాస్త్రం ప్రకారమే కాకుండా ఫెంగ్ షూయిలో కూడా క్రిస్టల్ కమలానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. స్ఫటిక కమలం వాస్తు శాస్త్రంలో శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో స్ఫటిక కమలాన్ని ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సానుకూల శక్తిని ఆకర్షించడానికి, ఇంట్లో ఆనందాన్ని కొనసాగించడానికి ఒక క్రిస్టల్ లోటస్‌ను మీ గదిలో పెట్టుకోవచ్చు. దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుందని నమ్ముతారు. ఇది ప్రతికూలతపై విజయానికి చిహ్నంగా భావిస్తారు. ఇంటి నైరుతి మూలలో దీన్ని పెట్టుకోవచ్చు.
వాస్తు యంత్రం
వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు యంత్రం ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. వాస్తు దోషాలను తొలగించడంలో వాస్తు యంత్రం కూడా ఉపయోగపడుతుంది. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల జీవితంలో ఆనందం, ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు.
ఏనుగు జంట
ఏనుగు ఆనందం, సంపద, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఎవరికైనా ఒక జత ఏనుగులను బహుమతిగా ఇవ్వడం చాలా శుభప్రదం. వెండి, ఇత్తడి లేదా చెక్కతో చేసిన ఏనుగుల జంటను ఇవ్వడం చాలా శుభప్రదమని చెబుతారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట శ్రేయస్సు నిలుస్తుంది. ఆనందం వెల్లివిరిస్తుంది. సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఈ ఏనుగు జతల ప్రతిమను బహుమతిగా ఇవ్వడం వల్ల వారి కోరిక నెరవేరుతుంది. వీటిని ఇంటికి తెచ్చుకుని పెట్టుకున్నా మంచిదే. ఉత్తరం, ఈశాన్య దిక్కులో జంట ఏనుగుల ప్రతిమలు పెట్టుకోవచ్చు.
ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్