Vastu Tips: భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మీ ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటించేలా చూడండి-follow these vastu tips in your home to make your husband and wife happy ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మీ ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటించేలా చూడండి

Vastu Tips: భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మీ ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటించేలా చూడండి

Haritha Chappa HT Telugu
Jun 21, 2024 05:02 PM IST

Vastu Tips: ఇల్లు ఆనందంగా ఉండాలంటే ఇంట్లోని వారంతా కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి. ఇంట్లోని వాస్తు సమస్యల వల్ల కూడా వైవాహక జీవితం పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

వాస్తు టిప్స్
వాస్తు టిప్స్ (Pexels)

Vastu Tips: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం చాలా ముఖ్యమైనది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ వివాహం విజయవంతంగా నడవాలంటే భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం మాత్రమే కాదు... ఇంట్లోని వాస్తు ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని పనులు వాస్తు శాస్త్రానికి వ్యతిరేకంగా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందాలనుకుంటే కొన్ని వాస్తు చిట్కాలను పాటించండి.

భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఇల్లు సంపూర్ణమవుతుంది. వారిద్దరి మధ్య భావోద్వేగ బంధాలను, శారీరక అనుబంధాలను కాపాడుకోవాలనుకుంటే కొన్ని అద్భుతమైన వాస్తు చిట్కాలు ఉన్నాయి.

భార్యాభర్తలు ఇంటి నైరుతి భాగంలో నిద్రించడం చాలా మంచిది. అలాగే మీ పడకగదిని లేత రంగులతో నింపుకోవాలి. తెలుపు, లేత పసుపు, గులాబీ లేదా లేత ఆకుపచ్చ, నీలం వంటి రంగులతో చేసిన పెయింటింగులను పెట్టుకోవడం, డోర్ కర్టెన్లను వేసుకోవడం చేయాలి. ఆ రంగులు ప్రశాంతంగా అనిపిస్తాయి. ఇంటిని సానుకూల వాతావరణంలో ఉంచుతాయి.

భార్యాభర్తలిద్దరూ ఒకే మంచంపై పడుకోవాలి. ఇద్దరూ వేరు వేరు పరుపులు వినియోగించకూడదు. ఒకే పరుపుపై నిద్రపోవాలి.

మెటల్ బెడ్‌ను ఇప్పుడు ఉపయోగించడం ట్రెండీగా మారింది. నిజానికి మెటల్ బెడ్‌ను వాడే కన్నా చెక్కతో చేసిన బెడ్‌ను ఉపయోగించడమే మంచిది. ఇది వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య ప్రతికూలతను దూరం చేసి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ సృష్టిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

మీ బెడ్ రూమ్ వంకరగా ఉండకూడదు. ఇది చతురస్రాకరంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో కచ్చితంగా ఉండాలి.

బెడ్రూంలో తాజా పువ్వులను రోజూ పెడుతూ ఉండండి. ఈ తాజా సువాసన భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని కొనసాగించేలా చేస్తుంది.

పడకగదిలో ప్రకృతి దృశ్యాలు, సుందరమైన పూల చిత్రాలు, శ్రీకృష్ణుడి చిన్నప్పటి చిత్రాలు పెట్టుకుంటే మంచిది. ఇది సానుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

మీ బెడ్ రూమ్ తలుపులు సగం తెరిచి ఉంచకండి. పూర్తిగా తెరిచి ఉంచండి లేదా పూర్తిగా మూసి ఉంచండి. అంతేగాని సగం తెరిచి ఉన్న తలుపులు జీవితంలోని విషయాలు సగమే అర్థమయ్యేలా చేస్తాయని అంటారు. అలాగే సానుకూల శక్తులను ఆహ్వానించడానికి కూడా సగం తెరిచిన తలుపు పనికిరాదు.

బెడ్ రూమ్లో ఎక్కడ పడితే అక్కడ అద్దాలను పెట్టకండి. ఈ అద్దాలు చెడు శకునాలను సృష్టిస్తాయని అంటారు.

ఇంట్లో ఈశాన్యభాగం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చేసుకోండి. అక్కడ చిందరవందరగా వస్తువులు పడేయకండి. ఇది భార్యాభర్తల అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. భార్యాభర్తల అనుబంధం బావుండాలంటే ఆర్థిక స్థిరత్వం చాలా అవసరం. కాబట్టి మీ డబ్బును లేదా సంపదను ఇంటి ఉత్తర లేదా తూర్పు ప్రాంతాలలో ఉంచడం మంచిది.

ఇంట్లో ఈశాన్య గదిలో వంటగదిని ఏర్పాటు చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఇంటికి గుండె లాంటిది. ఇక్కడ వంట గదిని పెడితే సానుకూల శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఎక్కడా కూడా ముళ్ళు ఉన్న మొక్కలు, బోన్సాయ్ మొక్కలు పెట్టకుండా చూసుకోండి. అలాగే ముదురు రంగులను వినియోగించకండి. ఇది జీవితంలో నెగిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది. ఇంట్లోని నైరుతి దిశలో సంపును కట్టకూడదు. అలా కడితే భార్యాభర్తల భావోద్వేగ సమతుల్యత చెడిపోతుంది. ఇలాంటి వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా భార్యాభర్తలూ ఇద్దరూ సంతోషంగా జీవించగలరు.

WhatsApp channel

టాపిక్