Peacock Feather Vastu Benefits : నెమలి ఈకలను ఇంట్లో అక్కడ ఉంచితే.. లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందట..-vasthu experts tells the right way to keep peacock feather at home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Peacock Feather Vastu Benefits : నెమలి ఈకలను ఇంట్లో అక్కడ ఉంచితే.. లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందట..

Peacock Feather Vastu Benefits : నెమలి ఈకలను ఇంట్లో అక్కడ ఉంచితే.. లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందట..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 16, 2022 11:31 AM IST

Peacock Feather Vastu Benefits : నెమలి పింఛాలు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఇంట్లో అలంకరణకు ఉపయోగిస్తారు. అయితే ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు. కొన్ని ప్రదేశాల్లో వాటిని ఉంచితే ఆర్థికంగా కలిసి వస్తుంది అంటున్నారు.

నెమలి పింఛాలను ఇంట్లో అక్కడ పెట్టండి..
నెమలి పింఛాలను ఇంట్లో అక్కడ పెట్టండి..

Peacock Feather Vastu Benefits : నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటుంది వాస్తు శాస్త్రం. అయితే నెమలి ఈకలను ఇంట్లో ఉంచడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా? అసలు వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? ఇది నిజంగా ఇంట్లోని వివిధ సమస్యలను పరిష్కరించగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అంతేకాకుండా ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతాయి. నెమలి ఈకలకు నిజంగా రకరకాల గుణాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. కానీ ఇంట్లో నెమలి ఈకలను ఉంచుకోవడం వల్ల ఈ ప్రయోజనం ఉండదని.. వాటిని ప్లేస్ చేయడానికి.. కొన్ని నియమాలు పాటించాలి అంటున్నారు. ఆ నియమాలు ప్రారంభంలోనే తెలుసుకోవాలి.

ఇంతకీ నెమలి ఈకను ఎక్కడ ఉంచాలి?

నెమలి ఈకలు లక్ష్మీదేవితో ముడిపడి ఉన్నాయని చెబుతారు. కాబట్టి ఇంటికి ఒక నిర్దిష్ట దిశలో నెమలి ఈకను ఉంచితే.. డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది అంటారు. అంతేకాకుండా నెమలి ఈకలను అమర్చినట్లయితే లక్ష్మీదేవి మాత్రమే కాకుండా సరస్వతీ దేవి కూడా తన కృపను కురిపిస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే నియమాలు తెలుసుకోవాలి.

* నెమలి ఈకలను ఇంటికి దక్షిణం వైపున ఉన్న అల్మారా, డెరాజ్ లేదా డబ్బు నిల్వ పెట్టెలో ఉంచండి. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుందని వాస్తు చెబుతోంది.

* నెమలి ఈకలను పట్టు గుడ్డతో కట్టి అలాగే ఉంచవచ్చు. దీనివ్లల మీరు మంచి ఫలితాలను పొందుతారని వాస్తు శాస్త్రంలో నమ్మకం.

* నెమలి ఈకలను ఇంటి తూర్పు, వాయువ్య గోడలపై కూడా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల రాహువు దోషం బాగా తగ్గుతుంది. రాహువు దోషంతో బాధపడేవారు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల సలహాతో దీన్ని చేయవచ్చు.

* మీరు పూజా స్థలంలో కూడా నెమలి ఈకలను కూడా ఉంచవచ్చు. ఇది ఖర్చు, వృధాను తగ్గిస్తుంది. ఇది మానిటైజేషన్ వేగాన్ని పెంచుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం