Telugu News  /  Rasi Phalalu  /  Follow These Simple Astro Tips In Morning For Good Luck And Lakshmi Devi Blessings
లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయండి
లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయండి

Astro Tips for Good Luck : ఉదయాన్నే ఆ పనులు చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట

11 November 2022, 7:19 ISTGeddam Vijaya Madhuri
11 November 2022, 7:19 IST

Astro Tips for Good Luck : రోజు బాగా ప్రారంభమైతే.. అన్ని పనులు దాదాపు పూర్తవుతాయి. రోజు ఆనందంగా గడిచిపోతుంది. ఇంతకీ రోజు ఎలా ప్రారంభించాలో తెలుసా? అయితే మీ రోజూ బాగా ప్రారంభమవ్వాలన్నా.. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలన్నా.. లేచిన వెంటనే ఈ సింపుల్ పనులు చేయాలంటున్నారు. మరి ఆ పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

Astro Tips for Good Luck : రోజూ ఉదయాన్నే మనం చేసే పనులే మన రోజును డిసైడ్ చేస్తాయి. మనం ఉదయం ఎంత పాజిటివ్ ఉంటే.. రోజూ కూడా అంతే సుఖంగా వెళ్లిపోతుంది. ఉదయాన్నే మూడ్ డిస్టర్బ్ చేసుకుంటే.. రోజంతా మూడీగా ఉంటుంది. అయితే మార్నింగ్ లేచి కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మిగులుతుంది అంటున్నారు. మీ డే హ్యాపీగా స్టార్ చేయాలన్నా.. అదృష్టం పొందాలన్నా మీరు కొన్ని ఉదయం చిట్కాలు ఫాలో అయిపోండి.

ట్రెండింగ్ వార్తలు

ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకూడదని కోరుకుంటాడు. అయితే కష్టపడి పనిచేసినా.. డబ్బు నిలవదు. అయితే శాస్త్రాలు ఏమంటున్నాయంటే.. శ్రమతో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటున్నాయి. మరి అదృష్టం ఉండాలంటే.. రోజూ ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుంది అంటున్నారు. ఇంతకీ అదృష్టాన్ని ఇచ్చే పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరచేతిని చూసుకోండి..

మీరు లేచిన వెంటనే.. మీ డే ని గుడ్ మార్నింగ్‌గా మార్చుకోవాలనుకుంటే.. ముందుగా మీరు కళ్లు తెరిచి.. మీ ఇష్ట దైవాన్ని తలచకుంటూ.. మీ అరచేతులను చూసుకోండి. చేతులను చూస్తూ.. "కరాగ్రే వసతే లక్ష్మి, కర్మధే సరస్వతి, కర్మలే పతితో బ్రహ్మ ప్రభాతే కర్దర్శనం" అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేసిన తర్వాత అరచేతులను ముఖంపైకి తిప్పాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ, సరస్వతి ఆశీస్సులు పొందుతామని నమ్ముతారు.

భూమికి నమస్కరించండి..

ఉదయం అరచేతులను చూసిన తర్వాత.. మీ పాదాలను నేలపై ఉంచే ముందు భూమికి నమస్కరించండి. తద్వారా మీరు రోజంతా సానుకూల అనుభూతి చెందుతారని చెప్తారు. భూమి మన భారాన్ని భరిస్తుంది. కాబట్టి భూమికి ధన్యవాదాలు చెప్పాలి అంటారు.

సూర్య దేవునికి నీరు

సూర్యోదయానికి ముందే నిద్రలేచి మల విసర్జన చేసి.. తర్వాత స్నానం చేయాలి. అనంతరం శుభ్రమైన బట్టలు ధరించి.. రాగి పాత్రతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. సూర్య భగవానుడికి అర్పించే నీటిలో ఎర్రటి పువ్వులు కలపడం శుభప్రదంగా భావిస్తారు. దీని తరువాత.. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ.. సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి.

తులసికి నీరు

సూర్యభగవానునికి నీళ్లు సమర్పించిన తరువాత.. తులసికి కూడా నీరు సమర్పించండి. తులసికి నీరు సమర్పించేటప్పుడు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించాలి. తులసికి నీళ్లు సమర్పించిన తర్వాత దాని కింద దీపం వెలిగించాలి. ప్రతిరోజూ ఉదయం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి..

వాస్తు శాస్త్రం ప్రకారం.. సూర్యోదయానికి ముందు నీటిలో ఉప్పు కలపడం, ఇంటిని తుడుచుకోవడం వల్ల ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది. దీనితో పాటు ఇంట్లో ఆనందం, శాంతి కూడా ఉంటుంది.

ఈ చిట్కాలు మీకు అదృష్టాన్ని ఇచ్చినా.. ఇవ్వకపోయినా మీ ఉదయానికి పాజిటివ్ వైబ్స్ కచ్చితంగా ఇస్తాయి. మీ రోజును లేజీగా కాకుండా.. ఎనర్జిటిక్​గా మార్చేస్తాయి. పైగా ఇవన్నీ చేయడం కూడా చాలా సింపుల్. ఏమో నిజంగానే వీటిని చేస్తే అదృష్టం కలిసి వస్తుందేమో. కష్టపడిన సొమ్ముదాచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాము. ఇవి చేయడం పెద్ద లెక్కేమి కాదు అనుకుని చేసేయడమే.

టాపిక్