Sankata hara chaturthi: నేడే సంకట హర చతుర్థి.. వినాయకుడిని ఇలా పూజించారంటే మీ పనులు నిర్విఘ్నంగా సాగుతాయి-today sankata hara chaturthi puja vidhanam shubha muhurtham full details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sankata Hara Chaturthi: నేడే సంకట హర చతుర్థి.. వినాయకుడిని ఇలా పూజించారంటే మీ పనులు నిర్విఘ్నంగా సాగుతాయి

Sankata hara chaturthi: నేడే సంకట హర చతుర్థి.. వినాయకుడిని ఇలా పూజించారంటే మీ పనులు నిర్విఘ్నంగా సాగుతాయి

Gunti Soundarya HT Telugu
Apr 27, 2024 06:00 AM IST

Sankata hara chaturthi: ఏప్రిల్ 27 సంకట హర చతుర్థి. పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగించుకునేందుకు ఈరోజు వినాయకుడిని ఇలా శ్రద్ధగా ఆచారాలతో పూజించాలి. మీ కోరికలన్నీ నెరవేరతాయి.

సంకట హర చతుర్థి
సంకట హర చతుర్థి

Sankata hara chaturthi: నేడు సంకట హర చతుర్ధిని జరుపుకుంటున్నారు. సంతానం కోసం, బిడ్డ దీర్ఘాయువు కోసం తల్లులు ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వినాయకుడిని, చంద్రుడిని పూజిస్తారు.

వినాయకుడిని పూజించడం వల్ల సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. సంకట హర చతుర్థి రోజు శివ యోగం, జ్యేష్ట నక్షత్రం కలిసి నవపంచమ యోగం ఏర్పడుతుంది.

శుభ సమయం

హిందూ క్యాలెండర్ ప్రకారం సంకట హర చతుర్థి శుభసమయం ఏప్రిల్ 27 ఉదయం 8.17 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 28 ఉదయం 8.21 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 27న సంకట హర చతుర్థి జరుపుకుంటారు.

పూజా విధానం

సంకట హర చతుర్థి రోజున వినాయకుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది సంపద, ఆనందం, అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం గంగా జలాన్ని చల్లి శుద్ధి చేసుకోవాలి.

పూజ గదిలో ఒక పీఠ పరిచి దాని మీద ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరచాలి. దానిపై వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. నియమాల ప్రకారం వినాయకుడికి పూజలు నిర్వహించాలి. విఘ్నేశ్వరుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. పండ్లు, పూలు, దుర్వా గడ్డి, దీపధూప, నైవేద్యాలు సమర్పించాలి. దర్భ గడ్డి వినాయకుడికి మహా ప్రీతికరమైనది. అందుకే పూజలో తప్పనిసరిగా దుర్వా గడ్డి పెడితే వినాయకుడ ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే వినాయకుడి బీజ్ మంత్రాలను పఠించాలి. మోదక్ లేదా మోతిచూర్ లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి.

పఠించాల్సిన మంత్రాలు

పూజ తర్వాత సంకట హర చతుర్థి కథను చదువుకోవాలి. తర్వాత ‘ఓం గణపతియే నమః’ అనే మంత్రాన్ని జపించాలి. పూర్తి శ్రద్ధలతో వినాయకుడికి హారతి ఇవ్వాలి. సాయంత్రం వేళ చంద్రుడిని చూసి అర్ఘ్యం సమర్పించాలి. సంకట హర చతుర్థి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు చంద్రుని దర్శనం అయిన తర్వాతే ఉపవాసం విరమించాలి. రోజు మొత్తం 'ఓం వినాయకాయ నమః' అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఈ రాశుల వారికి వినాయకుడి ఆశీస్సులు

సంకట హర చతుర్థి రోజు వృషభం, తుల, మకర రాశి తో సహా మరికొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వినాయకుడిని పూజించడం వల్ల పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి.

విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు కొత్త దశలు ఏర్పడతాయి. పురోగతి ఉంటుంది. విశ్వసనీయత పెరుగుతుంది. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కనబరుస్తారు. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఏ రంగంలో పనిచేసినా అందులో మీకు పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలను గడుపుతారు. స్నేహితులు, బంధువుల నుంచి ప్రత్యేక బహుమతులు అందుకుంటారు. గణేషుడి ఆశీర్వాదంతో ఆరోగ్యంగా జీవిస్తారు. కష్టపడి శ్రద్ధగా పనిచేస్తూ చుట్టుపక్కల వారి మెప్పును పొందుతారు. ఫలితంగా ఉద్యోగస్తులు మంచి వేతనాలు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఏవైనా వ్యాధులతో పోరాడుతుంటే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. మీ కోరికలు నెరవేరెందుకు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించండి.

 

 

WhatsApp channel