నేటి రాశి ఫలాలు: వీరికి శివారాధన శుభ ఫలితాలు ఇస్తుంది-today rasi phalalu for monday 18th december 2023 daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేటి రాశి ఫలాలు: వీరికి శివారాధన శుభ ఫలితాలు ఇస్తుంది

నేటి రాశి ఫలాలు: వీరికి శివారాధన శుభ ఫలితాలు ఇస్తుంది

HT Telugu Desk HT Telugu
Dec 18, 2023 04:05 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 18.12.2023 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం కూడా.

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 18.12.2023 సోమవారం
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 18.12.2023 సోమవారం (Pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 18.12.2023

వారం: సోమవారం, తిథి: శు.షష్టి నక్షత్రం: ధనిష్ట

పండగ: సుబ్రహ్మణ్య షష్ఠి, మాసం: మార్గశిరం, 

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించుట మంచిది. ఆధ్యాత్మిక విషయాలలో ప్రాధాన్యత వహిస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. పిల్లలు చదువులపై శ్రద్ధ వహిస్తారు.వారి విజయాలు సంతృప్తినిస్తాయి. మేషరాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.

వృషభరాశి 

వృషభరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. గృహయోగం కలుగుతుంది. చంద్రుడు జన్మరాశిలో ఉండుట వలన గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తలాభములుందును. ప్రేమ వ్యవహారాలకు దారితీసే అవకాశముంది. ఇసుక, మైనింగ్‌ వ్యాపారములు కలసివస్తాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయాణాలు కలసివస్తాయి. ఇష్టమైనవారితో సమయాన్ని గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. గృహనిర్మాణాలు కలసివస్తాయి. అందమైన ఆహ్లాదకరమైన నూతన గృహంలో నివాసయోగం కలుగుతుంది. ఆరోగ్యం అనుకూలించును. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన వస్త్రాభరణ ప్రాప్తి. మీరు కుటుంబముతో కలసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నుండి ఆదాయం పొందుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి వారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబముతో విందులో వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారం అభివృద్ధి. శత్రువర్గంపై విజయం సాధిస్తారు. అదృష్టం కలసివస్తుంది. శుభవార్తలు వింటారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది. 

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. దూరప్రయాణాలు కలసివస్తాయి. సంపద వృద్ధి అగును. కుటుంబములో ఆనందము. వివాహ అవకాశాలు ఫలించును. వ్యాపారంలో లాభాలు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు కలసివచ్చును. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు, మానసిక ఇబ్బందులు అధికమగును. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు కొంచెం ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారం లాభదాయకంగా ఉండును. స్నేహితుల నుండి ప్రశంసలు అందుకుంటారు. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. నిద్రలేమి వలన అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు కష్టపడాల్సినటువంటి సమయం. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. ఖర్చులు అధికమగును. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి 

ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు, వ్యాపారం లాభదాయకంగా ఉంటాయి. అన్ని వర్ణాల నుంచి గౌరవాన్ని పొందుతారు. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు కలసివచ్చును. విదేశీ విద్యలు అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ప్రమోషన్లు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ధనూరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకరరాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు. అధికార వృద్ది కలుగును. మకరరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. ఆదాయం లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. విద్యార్థులకు మధ్యస్థ సమయం. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. వ్యాపార వాటాల్లో పెట్టుబడులు, నూతన వ్యాపారాలు అనుకూలించవు. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబమునందు సమస్యలు ఏర్చడు సూచనలున్నాయి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. మీనరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

Whats_app_banner