మార్చి 20, నేటి రాశి ఫలాలు.. నిరుద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు-today march 20th 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 20, నేటి రాశి ఫలాలు.. నిరుద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు

మార్చి 20, నేటి రాశి ఫలాలు.. నిరుద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు

HT Telugu Desk HT Telugu
Mar 20, 2024 12:03 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ20.03.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 20వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 20వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 20.03.2024

వారం: బుధవారం, తిథి : ఏకాదశి,

నక్షత్రం : పుష్యమి, మాసం : ఫాల్గుణం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగస్తులకుపై అధికారుల సహకారంతో పదోన్నతులు పెరుగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీరు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రులతో భేదాభిప్రాయములు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో ఊహించని స్థానచలన మార్పులుంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. నూతన వస్త ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించాలి. కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశివారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రతి చిన్న విషయానికి కోపావేశాలకు గురవుతారు. నిరుద్యోగులకు చిన్నపాటి నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాల్లో రాజీ చేసుకుంటారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నూతన వస్త్ర అభరణాలు కొంటారు. దూరప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. శ్రీమన్నారాయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి అలయాలలో అర్చన జరిపించుకోవాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలున్నాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. ప్రతి చిన్న విషయానికి అందోళన చెందుతారు. అరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందముగా గడిపెదరు. కొన్ని ఊహించని సంఘటనలు వలన మానసిక చికాకులు అధికమవుతాయి. రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల సహాయ సహకారంతో పదోన్నతులు పెరుగుతాయి. సంతానపరంగా విద్యావిషయాలపై జాగ్రత్త తీసుకోవాలి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. కుటుంబసభ్యులతో ఆనందముగా గడిపెదరు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నిరుద్యోగులకు నూతన అవకాశాలుంటాయి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. చాలాకాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యలనుండి ఉపశమనం. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగమున్నది. కోర్టు సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతానపరంగా నూతన విద్యా ఉద్యోగావకాశాలున్నాయి. కుటుంబ పెద్దల అరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుని ఆలయాన్ని దర్శించాలి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళ వలన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోపావేశాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు కలసిరావు. దూరప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఏ పని చేపట్టిన అనుకున్న సమయానికి పూర్తి కాదు. వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలన మార్పులుంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహా విష్ణువు ఆలయాన్ని దర్శిచండం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యపరంగా చికాకులుంటాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. విద్యావిషయాలు కొంత అనుకూలిస్తాయి. నమ్మినవారి వల్లే మోసం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఆలంకాలుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు లాభదాయకం. కొన్ని వివాదాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ