సెప్టెంబర్ 13, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి-today daily horoscope september 13th rasi phalalu in telugu check your zodiac signs predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 13, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి

సెప్టెంబర్ 13, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి

HT Telugu Desk HT Telugu
Sep 13, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ13.09.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today rasi phalalu: సెప్టెంబర్ 13 నేటి రాశి ఫలాలు-
Today rasi phalalu: సెప్టెంబర్ 13 నేటి రాశి ఫలాలు- (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 13.09.2024

వారం: శుక్ర‌వారం, తిథి: ద‌శ‌మి,

నక్షత్రం: పూర్వాషాఢ‌, మాసం: భాద్ర‌ప్ర‌ద‌,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి కాలం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణాల ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. శివాలయాన్ని సందర్శిస్తే మంచిది.

వృష‌భం

కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయం. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అవకాశాలు రావొచ్చు. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

మిథునం

దూర ప్రయాణాలు కలిసివస్తాయి. పనులపై మనసు నిలపడం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొం టారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి కాలం. అదృష్టం కలిసివస్తుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలి తాలు పొందుతారు. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

క‌ర్కాట‌కం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు చేపట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. ప్రతికూల పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త వింటారు. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. వినాయకుడి ఆరాధన మేలుచేస్తుంది.

సింహం

కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్లవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అనుభవజ్ఞుల సహకారంతో పనులు చేస్తారు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

క‌న్య‌

బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పైస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. భూ లాభం సూచితం. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.

తుల‌

పాతబాకీలు వసూలు అవుతాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో కార్య సాఫల్యం ఉంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. అధికారుల అండదండలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటారు. శివాలయాన్ని సందర్శించండి.

వృశ్చికం

ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పదోన్నతి, అనుకూల బదిలీ ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచిపేరు సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం, గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. దుర్గాదేవి ఆరాధన మేలుచేస్తుంది.

ధ‌నుస్సు

శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయ త్నాలలో ఉన్నవారు శుభవార్త వింటారు. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు. పూర్వం పెట్టిన పెట్టుబడులకు ఫలితాలను పొందుతారు. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.

మ‌క‌రం

నేటి రాశి ఫలాల ప్రకారం మకర ఆరాసి ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయా ణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా అందడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. శ్రమతో పనులు పూర్తవుతాయి. భూ లావాదేవీలు కలిసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కుంభం

ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉన్నా జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహితీవేత్తలకు, కళాకారులకు అనుకూలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. శుభవార్త వింటారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

మీనం

ఉత్సాహంతో పనులు చేస్తారు. బరువు, బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఖర్చులు పెరగవచ్చు. సంయమనంతో ముందుకు వెళ్తారు. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఇష్టదేవతార్చన మేలుచేస్తుంది.

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ