సెప్టెంబర్ 6, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వాళ్ళు అజ్ఞాత వ్యక్తుల చేతిలో మోసపోతారు-today 6th september 2024 rasi phalalu in telugu check 12 zodiac signs horoscope predicition ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 6, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వాళ్ళు అజ్ఞాత వ్యక్తుల చేతిలో మోసపోతారు

సెప్టెంబర్ 6, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వాళ్ళు అజ్ఞాత వ్యక్తుల చేతిలో మోసపోతారు

HT Telugu Desk HT Telugu
Sep 06, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ06.09.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 6 నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 6 నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 06.09.2024

వారం: శుక్ర‌వారం, తిథి: త‌దియ‌,

నక్షత్రం: హస్త,

మాసం: భాద్రపద,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

సర్వత్రా అనుకూలదాయకం. పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అనుమానిత వ్యక్తులతో సంభాషించ వద్దు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పిల్లల యత్నం ఫలిస్తుంది. గృహమార్పు కలిసి వస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

వృషభం

ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవమర్యాదలు పొందుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

మిథునం

కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపు తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆరోగ్యం సంతృప్తి కరం. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహ పడవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజ పరుస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.

సింహం

కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. బుధవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త.

కన్య

ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. శుక్ర, శని వారాల్లో వ్యతిరేకులతో జాగ్రత్త. విమర్శలు పట్టించుకోవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

తుల

సర్వత్రా అనుకూలమే. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆదివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలే యండి. అయినవారితో సంభాషిస్తారు. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు.

వృశ్చికం

ఆచితూచి అడుగేయాలి. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెర వేరుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

ధనుస్సు

కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ధన లాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. పెట్టుబడులకు తరుణం కాదు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభా షిస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వాహనం ఇతరులకివ్వద్దు.

మకరం

ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సోమవారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.

కుంభం

మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మీనం

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. రుణ విముక్తులవుతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. పత్రాలు అందుతాయి. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ప్రియతములతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ